Jagadish Reddy VS Komatireddy Brothers In Assembly : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలతో సభా ప్రాంగణమంతా వేడి వాతావరణం ఏర్పడింది. అధికార పార్టీ విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక మంత్రి విడుదల చేసిన శ్వేతపత్రంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, కోమటి బ్రదర్స్ మధ్య వాడివేడి సంభాషణలు జరిగాయి. ఒకరిపై ఒకరు తమదైన శైలీలో చర్చలు జరిపారు. అధికారంలో ఉండి అనేక కుంభకోణాలు చేశారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణాలు చేశారు. అధికారం కోసం పార్టీలు మారే వాళ్లు తన కోసం మాట్లాడటం సరికాదని జగదీశ్ సమాధానమిచ్చారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ జగదీశ్‌రెడ్డి - విద్యుత్ రంగంపై వాడివే‘ఢీ’గా చర్చ
అధికారంలో పర్మినెంట్‌గా ఉంటాం అనుకున్న బీఆర్ఎస్కు ప్రజలిచ్చిన షాక్‌తో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతల తీరు మాత్రం మారడం లేదని మండిపడ్డారు. పార్టీలు మారామని తమ బ్రదర్స్‌ని విమర్శిస్తున్న వాళ్ల పార్టీ అధినేత కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. రూ.4లకే దొరికే పవర్‌ను రూ.6లకు పెంచి గత ప్రభుత్వం తప్పు చేసిందని విమర్శించారు.
Komati Brothers Fires on Jagadish Reddy : రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు పరిస్థితి చూస్తే జాలేస్తుందన్నారు. కిరోసిన్ దీపం, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి రూ.1000 కోట్ల విలువైన బంగ్లాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తాను పార్టీలు మారింది ప్రజల కోసమేనని, పదవులు, పైసల కోసం కాదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ముందు ఆ పార్టీ నాయకులకు మాట్లాడే ధైర్యముందా అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులు రూ. 81,516 కోట్లు : భట్టి విక్రమార్క
'మాజీ ముఖ్యమంత్రి ముందు ధైర్యంగా మాట్లాడలేదు అందుకే రాష్ట్రం అప్పుల పాలు అయింది. మా ముఖ్యమంత్రితో మేము చర్చించగలం మీకు ఆ పరిస్థితి ఉందా. నేను పార్టీ మారితే పదవికి రాజీనామా చేసే మారినా. మీ మాదిరి కాంగ్రెస్‌లో గెలిచిన 12 మందిని తీసుకోలేదు. మా పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు-' రాజ్‌గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే
Jagadish Reddy Counter to Komati Brothers : కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇప్పటివరకు తాను మాట్లాడిందంతా శ్వేతపత్రంలో ఉన్నదే అని వివరించారు.
తాను ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదని, అలా చేయడం ఆ అన్నదమ్ములకే అలవాటు. అవసరాలు, అధికారం, కాంట్రాక్టుల కోసం పార్టీలు మారేవాళ్లు నా గురించి మాట్లాడే అర్హత లేదు- జగదీశ్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే
సాగునీటి రంగానికి సంబంధించి ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందే : సీఎం రేవంత్ రెడ్డి