వరంగల్లో సీఎం కేసీఆర్పై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి ఖండించారు. అంబేడ్కర్ సిద్దాంతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మందకృష్ణ కాంగ్రెస్, భాజపాలకు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. మాదిగలకు మంత్రి పదవి దక్కడం గురించి కాకుండా..వర్గీకరణ పేరిట దీక్ష చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లు పెట్టాలని కాంగ్రెస్, భాజపాలను ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. 2004లో మందకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు.
వర్గీకరణ దీక్ష చేస్తే బాగుండేది: పిడమర్తి రవి - congress
అంబేడ్కర్ పేరును వాడే నైతిక హక్కు మందకృష్ణ మాదిగకు లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. మంత్రి పదవుల గురించి కాకుండా.. మందకృష్ణ మాదిగ వర్గీకరణ గురించి వరంగల్లో దీక్ష చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
![వర్గీకరణ దీక్ష చేస్తే బాగుండేది: పిడమర్తి రవి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4527795-32-4527795-1569233269390.jpg?imwidth=3840)