ETV Bharat / state

పొంగులేటి ఇంట్లో ముగిసిన ఐటీ దాడులు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 6:42 PM IST

IT Raids Completed on Ponguleti Srinivas Reddy House : కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి మొదలైన ఈ దాడులు ఇవాళ హైదరాబాద్​లోని పొంగులేటి ఇంట్లో ముగిశాయి. ఏకకాలంలో ఆయన నివాసాలు, కార్యాలయాలపై మూకుమ్మడి దాడులు జరపటం పట్ల స్పందించిన పొంగులేటి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

IT Raids on Ponguleti Srinivas Reddy
IT Raids on Ponguleti Srinivas Reddy House

IT Raids Completed on Ponguleti Srinivas Reddy House : పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిపై ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు బృందాలుగా(Two Teams) ఏర్పడి తనిఖీలు చేసిన అధికారులు.. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో గురువారం సోదాలు చేసిన అధికారులు.. ఈరోజు కూడా కొనసాగించారు.

విస్తృతంగా తనిఖీలు చేయడంతో పాటు.. ఖమ్మం నుంచి హైదారాబాద్‌కు వచ్చిన పొంగులేటి కుటుంబసభ్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని కీలక పత్రాలు(Important Documents) స్వాధీనం చేసుకన్న ఐటీ అధికారులు.. సోదాలు ముగిశాక అక్కిడి నుంచి వెళ్లిపోయారు. అలాగే గురువారం జరిగిన ఐటీ సోదాల్లో పత్రాలు, డాక్యుమెంట్లకు సంబంధించి పొంగులేటికి ఐటీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఖమ్మం నివాసంలో సోదాలు జరుగుతున్న సమయంలోనే.. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఆయన నివాసాలు, కార్యాలయాలపైనా ఐటీ దాడులు కొనసాగాయి.

పొంగులేటిపై "ఐ" టీ దాడులు- నివాసాలు, కార్యాలయాల్లో రోజంతా ఆదాయశాఖ సోదాలు

ఖమ్మం నగరంలోని పొంగులేటి కుటుంబీకులకు చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు , ఎస్​ఆర్ కన్వెన్షన్, రాఘవా కన్స్​ట్రక్షన్స్ కార్యాలయాలతోపాటు పొంగులేటి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలోని ఆయన ఇంటిలోనూ ఏకకాలంలో దాడులు(Simultaneous Attacks) జరిగాయి. ఎక్కడివారు అక్కడే కదలకుండా చేసి పటిష్ఠ బందోబస్తు విధించారు. పొంగులేటి నివాసంపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్న సమాచారం తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు భారీగా పొంగులేటి ఇంటి వద్దకు చేరుకుని నిరసించారు.

ఐటీ సోదాలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవ్వగా.. దాదాపు 5 గంటల పాటు పొంగులేటి ఇంటి నుంచి ఎవరూ బయటకు రాలేదు. 11 గంటల సమయంలో పొంగులేటి బయటకు వచ్చి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు.

Ponguleti Srinivas Reddy Nomination : ఐటీ అధికారుల అనుమతితో నామినేషన్ వేసేందుకు పొంగులేటి వెళ్లారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు.. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఖమ్మం గ్రామీణంలో ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఐటీ అధికారుల ఆదేశాల మేరకు మళ్లీ ఖమ్మంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై.. తనపై ఐటీ దాడులకు పురిగొల్పాయని పొంగులేటి మండిపడ్డారు. కాంగ్రెస్(Congress Party) నాయకులను, కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, భయభ్రాంతులకు గురిచేసేందుకు ఎన్ని దాడులు జరిపినా.. చివరకు తనను జైళ్లో బంధించినా ఒక్క అడుగు కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నిరంకుశ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు విశ్రమించబోనని ప్రతిజ్ఞ పూనారు. నామినేషన్ వేసే రోజే కావాలని ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురిచేసేందుకు ఈ దాడులకు తెరలేపారని నిట్టూర్చారు.

Revanth Reddy Vs KTR : రాహుల్​పై కేటీఆర్ 'ఎడ్లు-వడ్లు' వ్యాఖ్యలు.. ప్రాస కోసం పాకులాడే వారికేం తెలుసంటూ కాంగ్రెస్​ కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.