ETV Bharat / state

'తెలుగు వారందరినీ కలుపుకొని పీవీ శతజయంతిని జరుపుకుందాం' - హైదరాాబద్​ వార్తలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు కె.తారక రామారావు పిలుపునిచ్చారు. 51 దేశాల్లోని ప్రవాసులతో ఆన్​లైన్​ ద్వారా ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లో ఉన్న పీవీ జ్ఞానభూమిని సందర్శించి పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

it minister ktr visit  pv gnanbhoomi in hyderabad
పీవీ శత జయంతి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్​
author img

By

Published : Jun 26, 2020, 7:06 PM IST

Updated : Jun 26, 2020, 8:21 PM IST

తెలంగాణ అస్థిత్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవలను స్మరించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉందని.. పీవీ నర్సింహారావు, ఈశ్వరీబాయి, వెంకటస్వామి లాంటి వారిని పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకుంటూ వారి జయంతి కార్యక్రమాలను అధికారికంగా జరిపేలా అదేశాలిచ్చారని తెలిపారు. జయశంకర్ సార్​తో పాటు, పీవీ, కొండా లక్ష్మణ్, కొమురం భీం వంటి మహనీయుల పేర్లను విశ్వవిద్యాలయాలు, జిల్లాలకు పేర్లు పెట్టి స్మరించుకుంటున్నామని గుర్తు చేశారు.

పీవీకి భారతరత్న ఇవ్వాలి

తెలుగు ప్రజల ఖ్యాతిని ఖండాంతరాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పీవీ నర్సింహారావుకు రావాల్సిన పేరు రాలేదన్నారు. పీవీకి భారతరత్న రావాలన్నారు. ఈ విషయంలో ప్రధానిని స్వయంగా కలుస్తానని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకునికిగా, ప్రధానిగా అద్భుతమైన సేవలందించిన మహనీయుడి జయంతిని రానున్న ఏడాది పాటు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రవాసులందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఏడాది పాటు ఉత్సవాలు

ముందు ఎల్లుండి అన్ని దేశాల్లోని తెలుగు వారందరినీ కలుపుకొని పీవీ జయంతిని జరుపుకోవాలని మంత్రి కోరారు. మిగిలిన తెలంగాణ, తెలుగు సంఘాలతో సమన్వయం చేసుకొని ఉత్సవాలను నిర్వహించాలని మంత్రి సూచించారు. ఏడాది పాటు జరగనున్న ఉత్సవాలను సమన్వయం చేసుకునేందుకు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలను శతజయంతి ఉత్సవాల కమిటీలో సభ్యునిగా చేర్చుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమిని మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులతో కలిసి సందర్శించిన కేటీఆర్... ఆదివారం కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. శతజయంతి ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా ఉండాలని... ఎలాంటి లోటు రాకుండా ఉత్సవాలు ఘనంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

Last Updated : Jun 26, 2020, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.