ETV Bharat / state

ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాం: మల్లారెడ్డి కుటుంబీకులు - మర్రి రాజశేఖర్​రెడ్డిని విచారించిన ఐటీ

IT Enquiry on Minister Malla Reddy Assets : ఆదాయపన్ను శాఖ అధికారులు అడిగిన ప్రశ్నలకు పూర్తిస్థాయిలో సమధానం ఇచ్చామని మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్​రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారించారన్న మర్రి రాజశేఖర్‌రెడ్డి.. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి ఆస్తుల కేసులో... ఇవాళ వీరిని ఐటీ అధికారులు ఆరుగంటల పాటు ప్రశ్నించారు.

Mallareddy
Mallareddy
author img

By

Published : Nov 28, 2022, 7:40 PM IST

Updated : Nov 28, 2022, 7:55 PM IST

IT Enquiry on Minister Malla Reddy Assets: మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 22, 23 తేదీల్లో మల్లారెడ్డికి సంబంధించిన వ్యాపారాలు, విద్యా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల తర్వాత 16 మందికి నోటీసులు జారీ చేశారు. బషీర్‌బాగ్‌లోని ఆదాయపు పన్ను కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు... ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకు చెందిన డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, అకౌంటెంట్లు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. మొత్తం 13 మంది విచారణకు హాజరయ్యారు.

మంత్రి మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డిని సైతం ఐటీ అధికారులు ప్రశ్నించారు. 3రోజుల క్రితం 48 గంటలపాటు మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఇళ్లలో సోదాలు నిర్వహించిన సమయంలో కీలక డాక్యుమెంట్లు, లాప్‌టాప్‌లు, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. వాటిని విశ్లేషించిన ఐటీ అధికారులు.. అందులోని సమాచారం ఆధారంగా వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఆదాయపుపన్ను చెల్లింపు... టర్నోవర్​లో వ్యత్యాసాలు ఉన్నట్లు అనుమానించిన ఐటీ అధికారులు.. వాటి గురించి ఆరా తీసినట్లు సమాచారం. మొత్తం ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా వివరాలు తీసుకున్నారు. ఐటీ అధికారుల ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చామని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలపై విచారణ చేశారని... వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామన్నారని వెల్లడించారు.

ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాం: మల్లారెడ్డి కుటుంబీకులు

'ఐటీ అధికారుల ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాం. ఇంజినీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలపై విచారణ చేశారు. మరి కొందరికి సమాన్లు ఇచ్చి విచారిస్తామని అధికారులు తెలిపారు. ఐటీ అధికారుల విచారణకు మేము పూర్తిగా సహకరిస్తాం.'-మర్రి రాజశేఖర్​రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు

'ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాం. మాతో పాటు కళాశాలల ప్రిన్సిపల్స్, సిబ్బందిని విచారణ చేశారు. మా స్టేట్​మెంట్లతో పాటు కళాశాలల సిబ్బంది స్టేట్​మెంట్లు రికార్డు చేశారు. అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామన్నారు. అధికారులు అడిగిన ఫార్మాట్​లో మేము పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెంది ఉన్నారని అనుకుంటున్నాం. త్వరలో మిగతా వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని తెలిపారు.'-భద్రారెడ్డి, మల్లారెడ్డి కుమారుడు

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.