ETV Bharat / state

గీతంలో ఇష్టమ్ 65వ అంతర్జాతీయ సదస్సు - ఐఐబీ బిలాయ్​ డైరెక్టర్ ప్రొఫెసర్ రజత్ మోనె

హైదరాబాద్ శివారు రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇష్టమ్ 65వ అంతర్జాతీయ సదస్సును బుధవారం ప్రారంభించారు. ఐఐబీ బిలాయ్​ డైరెక్టర్ ప్రొఫెసర్ రజత్ మోనె సావెనీర్​ను విడుదల చేశారు.

Istam 65th International Conference on githam
గీతంలో ఇష్టమ్ 65వ అంతర్జాతీయ సదస్సు
author img

By

Published : Dec 10, 2020, 5:15 AM IST

ఇంజినీరింగ్ గతినే కంప్యూటింగ్ మార్చి.. భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఐఐబీ బిలాయ్​ డైరెక్టర్ ప్రొఫెసర్ రజత్ మోనె అన్నారు. హైదరాబాద్ శివారు రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇష్టమ్ 65వ అంతర్జాతీయ సదస్సును లాంఛనంగా ప్రారంభించి సావెనీర్​ను విడుదల చేశారు. గీతంలోని గణితశాస్త్రం, మెకానికల్, ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల సదస్సుకు ఆయన హాజరయ్యారు.

ప్రొఫెసర్ రజిత్ మెకానిక్స్​ను ఉపయోగించి అధిక పనితీరు గల కంప్యూటింగ్ అనే అంశంపై ప్రసగించారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఇష్టమ్ అధ్యక్షులు డాక్టర్ జీపీ రాజశేఖర్ దాని ఎదుగుదల ఎంపిక చేసిన లక్ష్యాలు, ఇష్టమ్ పాత్రల గురించి వివరించారు.

సంయుక్త పరిశోధనలు చేపట్టడానికి గీతం విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉన్నట్లు గీతం అధ్యక్షులు భరత్ తెలిపారు. గణిత శాస్త్రం లేకుండా ఇంజినీరింగ్ లేదని... ఇంజినీరింగ్ లేకుండా మెకానికల్ ఇంజినీరింగ్ ఉండదని... ఈ ఒరవడి మరింతకాలం కొనసాగి.. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపే విధంగా యువతను సన్నద్ధం చేయాలని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ఎన్.శివప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : ఐఏఎస్ అధికారుల సంఘం కొత్త అధ్యక్షుడు ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.