ETV Bharat / state

ఆ స్టూడెంట్స్​ సగటు వేతనం రూ.28.29 లక్షలు

హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) మరో ఘనతను సాధించింది. తన రికార్డును తానే బ్రేక్​ చేసింది. 2021 పీజీపీ (పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌) విద్యార్థులకు ప్లేస్‌మెంట్లలో అత్యధిక వార్షిక వేతనాలు సగటున రూ.28.29 లక్షలు లభించినట్లు పేర్కొంది. ఈ బ్యాచ్‌ విద్యార్థులకు వివిధ కంపెనీల్లో ఆకర్షణీయ ఉద్యోగాలు వచ్చినట్లు ప్రకటించింది.

isb school students average salary Rs.28.29 lakhs per year
ఆ స్టూడెంట్స్​ సగటు వేతనం రూ.28.29 లక్షలు
author img

By

Published : Mar 24, 2021, 7:50 AM IST

కొవిడ్‌-19 మహమ్మారితో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), 2021 పీజీపీ (పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌) విద్యార్థులకు మెరుగైన ప్లేస్‌మెంట్లు లభించాయి. ఈ బ్యాచ్‌ విద్యార్థులకు వివిధ సంస్థలు 1145 ఉద్యోగాలు ఇవ్వజూపినట్లు, జీతభత్యాల వార్షిక ప్యాకేజీ (సీటీసీ) సగటున రూ.28.29 లక్షలు ఉన్నట్లు ఐఎస్‌బీ వెల్లడించింది. ఇంతవరకు ఇదే అత్యధిక సగటు ప్యాకేజీగా పేర్కొంది. గత ఏడాది సగటు వార్షిక వేతనం రూ.26.12 లక్షలతో పోల్చితే ఈసారి 8.32% పెరిగింది.

ఆ రంగాల్లో:

కన్సల్టింగ్‌, ఐటీ/ఐటీఈఎస్‌/టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ/రిటైల్‌, ఫార్మా/హెల్త్‌కేర్‌ విభాగాల పరిశ్రమల నుంచి అధికంగా ఉద్యోగాలు లభించాయి. కన్సల్టింగ్‌ సంస్థలే 388 ఉద్యోగాలు ఆఫర్‌ చేశాయి. అర్బన్‌ మొబిలిటీ విభాగానికి చెందిన కంపెనీలు 35 ఉద్యోగాలు ఇచ్చాయి. ఫిన్‌టెక్‌, ఎడ్యుటెక్‌, అగ్రిటెక్‌, గేమింగ్‌ విభాగాల కంపెనీలు సైతం ఎక్కువగా ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయి.

ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో

కన్సల్టింగ్‌ విభాగానికి చెందిన మెకిన్సే అండ్‌ కంపెనీ, డెలాయిటీ, ఆక్సెంచర్‌ సొల్యూషన్స్‌, బెయిన్‌ అండ్‌ కంపెనీ, కెర్నీ, పీడబ్లూసీ, జడ్‌ఎస్‌ అసోసియేట్స్‌, కేపీఎంజీ, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌.. తదితర ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. బ్యాంకింగ్‌ సంస్థల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంకు, సిటీ బ్యాంక్‌, క్రెడిట్‌ స్యూయిస్సీ, బార్‌క్లేస్‌, వెల్స్‌ ఫార్గో ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ అయిన కేపిటల్‌ పార్ట్‌నర్స్‌, వీసీ సంస్థ అయిన మ్యాట్రిక్స్‌ పార్టనర్స్‌, ఐటీ, ఇ-కామర్స్‌ కంపెనీలైన మైక్రోసాఫ్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఉబర్‌, సిస్కో, రేజర్‌పే, మింత్ర, ఓలా ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్‌, నైకా, హిల్యాబ్స్‌ ఆకర్షణీయ ఉద్యోగాలు ఇచ్చాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ గ్రూపులు.. తమ తమ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలుగా కొందరిని తీసుకున్నాయి. ఎఫ్‌ఎంసీజీ విభాగానికి చెందిన హెచ్‌యూఎల్‌, కాల్గేట్‌, ఐటీసీ, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌.. కంపెనీలు మంచి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఐఎస్‌బీ పేర్కొంది.

40 శాతం మంది మహిళలు

పీజీపీ విద్యార్థుల్లో 40 శాతం మంది మహిళలని, వారికి ఆకర్షణీయ ఉద్యోగాలు లభించాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురైన సవాలుకు అనుగుణంగా ఐఎస్‌బీ తన బోధనా పద్ధతులను, విధానాలను మార్చుకోవడమే కాకుండా.. పరిస్థితులకు తగ్గట్లు విద్యార్ధులను తీర్చిదిద్దినట్లు ఐఎస్‌బీ డీన్‌ ప్రొఫెసర్‌ రాజేంద్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు. దీనివల్ల పీజీపీ విద్యార్థులకు వివిధ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశాలు దక్కినట్లు వివరించారు.

ఇదీ చూడండి : సరికొత్త రియల్‌ దందా.. అనుమతులు రాకముందే విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.