Tongue Scraping Benefits : ఉదయాన్నే బ్రష్ చేయడం గురించి అందరూ మాట్లాడుతారు. రాత్రి వేళ కూడా బ్రష్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. కానీ.. నాలుక క్లీనింగ్ అనేది ఎందుకో సెకండ్ ప్రయారిటీగా మిగిలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇళ్లలో పెద్దలు కూడా.. పిల్లలు బ్రష్ చేశారా లేదా? అనేదే చూస్తారు. కానీ.. నాలుకను సరిగా క్లీన్ చేశారా? అని పెద్దగా పట్టించుకోరు. మరి.. టంగ్ క్లీనింగ్ ఇంపార్టెన్స్ ఎంత? దీనికి టంగ్ క్లీనర్స్ వాడాలా? వాడితే ఏమవుతుంది? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
నోటి శుభ్రతకూ.. గుండె జబ్బులకూ లింక్ ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. దీన్నిబట్టి నోరు క్లీన్‌గా ఉంచుకోవడం ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆహారం తినేటప్పుడు దంతాలు కేవలం నములుతాయి. తిండిని రొటేట్ చేయడం.. లిక్విడ్ యాడ్ చేయడం.. మింగడం.. వంటి పనులన్నీ నాలుకే చేస్తుంది. ఇలాంటి నాలుకను సరిగా క్లీన్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి.
- నాలుకను క్లీన్ చేయకుండా అపరిశుభ్రంగా ఉంచితే.. నాలుక మీద ఉండే లాలాజల గ్రంథులు కాస్త మూసుకుపోతాయి. టేస్ట్ బడ్స్ కూడా మూసుకుపోతాయి. దీంతో నాలుక అనారోగ్యానికి గురవుతుంది.
- అంతేకాదు.. తిన్న ఆహారంలోని పార్టికల్స్ నాలుక మీద పేరుకుపోతాయి. వీటి ద్వారా బ్యాక్టీరియా విజృంభిస్తుంది. నాలుకపై టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇవి పెరిగి చిగుళ్ల వ్యాధికి, దంత క్షయానికి కారణం అవుతాయి.
- ఈ పరిస్థితి ముదిరితే నోటి దుర్వాసన వేధిస్తుంది. చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. ఈ దుర్వాసన నిరంతరంగా కొనసాగుతుంది. నాలుక ఉపరితలంపైన ఉండే సూక్ష్మక్రిములు, ఫుడ్ పార్టికల్స్, ఇతర డిట్రిటస్ కలిసి ఈ పరిస్థితిని తీసుకొస్తాయి.
- దీంతో.. నోరు పొడిబారుతుంది. అపరిశుభ్రమైన నాలుక వల్ల నోరంతా అధ్వాన్నంగా మారుతుంది. డస్ట్ పార్టికల్స్ నాలుకపై పేరుకుపోవడం వల్ల లాలాజలం ప్రొడక్షన్లో ఇబ్బంది కలగొచ్చు. ఇది దుర్వాసన పెరగడానికీ, అసౌకర్యానికీ కారణమవుతుంది.
మీ టూత్‌పేస్ట్‌లో క్యాన్సర్ ఉందా?
టంగ్ క్లీనింగ్ కంపల్సరీ..
- పై ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ప్రతిరోజూ రెండు పూటలా బ్రష్ చేయడమే కాదు, తప్పకుండా టంగ్ క్లీనింగ్ చేయాలి.
- వేళ్లతో క్లీన్ చేయడం వల్ల పాచి పూర్తిగా తొలగిపోయే ఛాన్స్ ఉండదు. అందువల్ల తప్పకుండా టంగ్ క్లీనర్ ఉపయోగించాలి. మృదువుగా క్లీన్ చేయాలి.
- టంగ్ క్లీన్ చేసిన తర్వాత.. నోటిలోని వేస్టేజ్ తొలగిపోయి నోరు తాజాగా మారుతుంది. టేస్ట్ బడ్స్ ఓపెన్ అవుతాయి. మంచి రుచిని ఆస్వాదించొచ్చు.
- జీర్ణక్రియ సజావుగా సాగడానికి నాలుక ఆరోగ్యం చాలా అవసరం. టంగ్ క్లీన్ చేయకపోతే.. జీర్ణ వ్యవస్థకు ఆటంకం కలిగించే సూక్ష్మజీవులు, ఫుడ్ పార్టికల్స్ పొట్టలో చేరి ఇబ్బంది కలిగించే ఛాన్స్ ఉంది.
- ఇక నోటి దుర్వాసనతో ఇతరులతో మాట్లాడడానికి కూడా కొందరు ఎంతగా ఇబ్బంది పడుతుంటారో తెలిసిందే. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే నాలుకను హెల్దీగా ఉంచుకోవాలి.
ప్రకాశవంతమైన చిరునవ్వుకు.. నోటి సంపూర్ణ ఆరోగ్యానికి టంగ్ క్లీనింగ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి.. ఇంట్లో పెద్దలు నాలుకను చక్కగా క్లీన్ చేసుకోవడంతోపాటు పిల్లలు కూడా సరిగా శుభ్రం చేసుకుంటున్నారా? లేదా? అన్నది చూడాలి. వారికి విషయం అర్థం చేయించాలి. తద్వారా నోటితోపాటు సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకున్నవారు అవుతారని నిపుణులు సూచిస్తున్నారు.
నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుందా ? ఈ హోమ్మేడ్ టిప్స్‌తో రిలీఫ్ పొందండి!