ETV Bharat / state

టికెట్​ ధర పెంపే మార్గమా?

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది ఆర్టీసీ పరిస్థితి. ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రోడ్డు రవాణా సంస్థపై డీజిల్ ధర పెరగడం వల్ల మరింత​ భారం పడనుంది. కష్టాల్లోంచి బయటపడాలంటే టికెట్ల ధర పెంచడమే మేలని భావిస్తోంది ఆర్టీసీ. ఛార్జీల పెంపుపై ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది.

ఆర్టీసీ
author img

By

Published : Jul 8, 2019, 4:43 AM IST

Updated : Jul 8, 2019, 7:50 AM IST

టికెట్​ ధర పెంపే మార్గమా?

తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. గడిచిన ఐదేళ్లలో ఏడాదికి సగటున ఆరేడు వందల కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.900ల కోట్ల నష్టం వచ్చింది. తాజాగా డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈ నష్టం రూ.1000 కోట్లు దాటుతుందని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేల కోట్ల అప్పులు

అధికారిక లెక్కల ప్రకారం ఆర్టీసీకి సుమారు రూ.3,200ల కోట్ల వరకు అప్పులున్నాయి. బ్యాంకుల నుంచి రూ.1,700 కోట్లు, ఉద్యోగుల పీఎఫ్ నుంచి రూ.750 కోట్లు, ఉద్యోగులు నెలవారీ సొసైటీలో దాచుకున్న రూ.600ల కోట్లను కూడా యాజమాన్యం వాడుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల అవసరాలకు సొసైటీ నుంచి రుణాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో డీజిల్ ధరలు పెరగడం ఆర్టీసీకి ప్రాణసంకటంగా మారిపోయింది. ఏం చేయాలో తెలియని అధికారులు టికెట్​ ఛార్జీలు పెంచేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

అనుమతిచ్చేనా?

ప్రభుత్వం నుంచి ఛార్జీలను పెంచేందుకు ఎలాంటి అనుమతి లభించలేదు. నాలుగేళ్ల క్రితం ఆర్టీసీ 12 శాతం ఛార్జీలు పెంచింది. 20 శాతం వరకు టికెట్​ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతిస్తే..రూ.650 కోట్ల నుంచి రూ.700ల కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం కనీసం 15 శాతం ఛార్జీలు పెంచేందుకు అనుమతి లభిస్తుందనే ఆశాభావం అధికారుల్లో వ్యక్తమవుతుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో టికెట్​ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా..లేదా..అనేది వేచి చూడాల్సిందే.

ఇవీ చూడండి: కర్​నాటకం: కాంగ్రెస్-జేడీఎస్​ నేతల భేటీ

sample description
Last Updated : Jul 8, 2019, 7:50 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.