కాకతీయ, వరదకాలువల మధ్యనున్న 26వేల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వ నిర్ణయించింది. మోతె జలశాయం నుంచి కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని పొలాలకు నీరివ్వాలని గతంలో నిర్ణయించి గుత్తేదారుతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దానికి బదులు వరద కాలువ నుంచి కాలువల నెట్ వర్క్ ద్వారా సాగునీరందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. జలాశయ నిర్మాణం కోసం గతంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసింది.
వరదకాలువ నుంచి 26,482 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందుకోసం 248.41 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.