ETV Bharat / state

Irrigation department: 'ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే ఈ నంబర్​కు ఫోన్ చేయండి' - hyderabad news

గులాబ్ తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులను నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షసూచన నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు రజత్ కుమార్ పేర్కొన్నారు.

Irrigation department
Irrigation department
author img

By

Published : Sep 28, 2021, 4:08 PM IST

గులాబ్ తుపాను దెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులను ఏఈఈ స్థాయి ఇంజినీర్లతో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులను ఆరా తీశారు. రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో... ఇంజినీర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రజత్ కుమార్ సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఇంజినీర్లకు ఉన్న ఆర్థికాధికారాలను వినియోగించుకోవాలని తెలిపారు.

నీటిపారుదలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే ప్రజలు వెంటనే కంట్రోల్ రూం నంబర్ 040-23390794 కు ఫోన్ చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోరారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని... ఎక్కడా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కాలేదని చీఫ్ ఇంజనీర్లు తెలిపారు. కొన్ని చోట్ల చెరువులకు పడిన గండ్లను వెంటనే పూడ్చివేశామని పేర్కొన్నారు.

హైదరాబాద్ పరిధిలో 15 ప్రత్యేక బృందాలు

ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉండడంతో హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు రజత్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటల పరిస్థితిని అధ్యయనం చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యల కోసం నీటిపారుదల శాఖ ఈ బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

మొత్తం 185 చెరువులు, కుంటల పరిరక్షణ కోసం 15 ప్రత్యేక బృందాలు సూపరింటెండెంట్ ఇంజినీర్ల నేతృత్వంలో ఏర్పాటు చేశామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ ప్రత్యేక బృందాలు తమకు కేటాయించిన చెరువులు, కుంటలను పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: weather report: రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.