రామాయణంలో ప్రముఖ ప్రదేశాలన్నింటిని సందర్శించేందుకు రామాయణ యాత్ర పేరుతో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ను నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. రాముడు, సీత జీవితాలతో సంబంధం ఉన్న 11 ప్రాంతాలకు వెళ్లే విధంగా... మే నెలలో యాత్రను చేపట్టేందుకు ఏర్పాటు చేస్తోంది.
గంగా, యమున నదీ తీరాల్లోని హరిద్వార్, అలహాబాద్, వారణాసి, దిల్లీ, ఆగ్రా వంటి నగరాలతోపాటు... జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ వంటి చారిత్రక కోటలకు వెళ్లేందుకు రాయల్ రాజస్థాన్ పేరుతో యాత్రలను అందుబాటులోకి తేనున్నట్లు ఐఆర్‌సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య వెల్లడించారు.
ఇవీ చూడండి: 'పట్టా'లెక్కని ప్రగతి