IPS Transfers in Telangana : తెలంగాణాలో 23 మంది ఐపీఎస్ అధికారులను, 21 మంది నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది. ప్రస్తుతం పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసరావును సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా నియమించింది. రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు కేటాయించారు. కోఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్‌ను నియమించింది. రాష్ట్ర మహిళ భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరిని నియమించింది. రామగుండం పోలీస్ కమిషనర్గా(Ramagundam Police Commissioner) చౌహాన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌ల బదిలీ, క్రైమ్స్ జాయింట్ సీపీగా రంగనాథ్
Latest IPS Transfers Telangana : జోన్ 7 (జోగులాంబ) డీఐజీగా జోయల్ డేవిస్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఖమ్మం కమిషనర్గా పనిచేసిన విష్ణు వారియర్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అదేశించింది. మల్కాజిగిరి డీసీపీగా పద్మజ కేటాయించింది. నిర్మల్ ఎస్పీగా జానకీ షర్మిళను నియమించింది. హైదరాబాద్ ఆగ్నేయ మండలం డీసీపీగా జానకి ధరావత్, ఖమ్మం పోలీస్ కమిషనర్గా(Khammam Police Commissioner) సునీల్ దత్, సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్, టీఎస్ ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, రాజేంద్ర నగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా వెంకటేశ్వర్లు, జయశంకర్ భూపాల పల్లి ఓఎస్డీగా అశోక్ కుమార్, ఎల్బీ నరగ్ డీసీపీగా సీహెచ్ ప్రవీణ్‌కుమార్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ - ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్
Non Cadre SP Transfers in Telangana : సిద్దిపేట కమిషనర్గా అనురాధ, మేడ్చల్ డీసీపీగా నితిక పంత్, ములుగు డీసీపీగా శబరీష్, మాధాపూర్ డీసీపీగా వినీత్, ఆదిలాబాద్ ఎస్పీగా గౌష్ అలాం, మెదక్ ఎస్పీగా బాలస్వామి, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బిరుదురాజు రోహిత్ రాజులను ప్రభుత్వం నియమించింది. వారితో పాటు రాష్ట్రంలో మరో 21 మంది నాన్ కేడర్ ఎస్పీల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- నార్కొటిక్స్ కంట్రోల్ సెల్ ఎస్పీగా రఘువీర్
- అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా శ్రీనివాసరెడ్డి
- ఇంటిలిజెన్స్ ఎస్పీగా ప్రసన్నరాణి
- హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీగా శిల్పవల్లి
- హైదరాబాద్ అడ్మిన్ డీసీపీగా మహ్మద్ ఇక్బాల్ సిద్దక్కి
- టీఎస్‌పీఏ డిప్యూటి డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లు
- ఇంటిలిజెన్స్ ఎస్పీగా రవీందర్ రెడ్డి
- టీఎస్ సైబర్ సెక్యూరిటి బ్యూరో ఎస్పీగా దేవంద్ర సింగ్
- టీఎస్‌న్యాబ్ సైబరబాద్ నార్కొటిక్ సెల్ ఎస్పీగా భాస్కర్ అగ్గడి
- రాచకొండ కమిషనరేట్ టాస్క్‌పోర్స్ డీసీపీగా గుండేటి చంద్రమోహన్
- రాచకొండ ఎస్బీ డీసీపీగా పుల్లా కరుణాకర్
- రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా మనోహర్ కశివ
- సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీగా కొత్తపల్లి నరసింహ
- సైబరాబాద్ మహిళా భద్రతా విభాగం డీసీపీగా కర్నం సృజన
- సీఐడీ ఎస్పీగా ఎస్ శ్రీనివాస్
- మేడ్చల్ ఎస్‌ఓటి డీసీపీగా శ్రీనివాస్
- గ్రేహౌండ్ గ్రూప్ కమాండర్‌గా రాఘవేందర్ రెడ్డి
- రాచకొండ మహేశ్వరం జోన్ డీసీపీగా సునితా రెడ్డి
- హైదరాబాద్ తూర్పు మండల డీసీపీగా సాయి శ్రీ
- డీజీపీ కార్యాలయం అసిస్టెంట్ ఏఐజీగా రమణ కుమార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.
తెలంగాణలో కొత్త సర్కార్ - ప్రభుత్వ అధికారుల పోస్టింగులపై చర్చ - డీజీపీ నుంచి సీఐ వరకు బదిలీలు!
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరికొంత మంది పోలీసుల బదిలీ - కారణమిదే!