పెళ్లిపత్రికలు రకరకాలుగా రూపొందిస్తుంటారు. కొందరు విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో రైల్వేశాఖ ఉన్నతాధికారి శశికాంత్ మరికాస్త వైవిధ్యంగా ఆలోచించారు. పర్యావరణహితం, పచ్చదనాన్ని దృష్టిలో ఉంచుకొని తన వివాహానికి విత్తనాలు పొదిగిన ఆహ్వానపత్రికను తయారు చేయించారు. కూరగాయల విత్తనాలను అందులో పొందుపరిచారు. ఈ పత్రికను నాటండని కోరుతూ... ప్రేమను సాగు చేయండని విజ్ఞప్తి చేశారు.
తన వివాహానికి రావాలని కోరుతూ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి శశికాంత్ ఆహ్వానపత్రికను అందించారు.
ఇదీ చదవండి: 'ఓట్లు, సీట్ల కోసం మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు'