ప్రజాస్వామ్య పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డా.చెరుకు సుధాకర్ విమర్శించారు. కరోనాతో ఎంత ప్రమాదముందో... తెలంగాణకు కేసీఆర్తో అంతే గండముందని అన్నారు. సమస్యలపై పోరాడే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేస్తున్నారని... విద్యార్థులను లాఠీలు విరిగేలా కొట్టించారని మండిపడ్డారు.
నిరసన తెలిపే హక్కును ముఖ్యమంత్రి కాలరాస్తున్నారని... ఆశా వర్కర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పట్ల వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనమన్నారు. మల్కాజిగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నామని తెలిపారు. డ్రోన్ వాడినందు వల్ల ఓ ఎంపీను అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని మండిపడ్డారు.
- ఇదీ చూడండి : 'తొలి కరోనా మృతి నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ'