బీటెక్, బీఫార్మసీ విద్యార్థులకు ల్యాబొరేటరీ తరగతులు మాత్రమే కాలేజీల్లో ఉంటాయని... థియరీ ఆన్ లైన్ లోనే పూర్తిచేస్తామని జేఎన్ టీయూహెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ వెల్లడించారు. 50శాతానికి మించి విద్యార్థులు కళాశాలలకు రాకూడదని సూచించారు. 80కిలోమీటర్ల కంటే ఎక్కువ దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మాత్రమే వసతి గృహాల్లో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంజినీరింగ్ పరీక్షల్లోనూ ప్రశ్నల్లో ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు మంజూర్ హుస్సేన్ ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు.
ఇదీ చూడండి: 'డిమాండ్ ఉన్న కోర్సులు చేస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు'