ప్రశ్న: అల్ట్రావయోలెట్ శానిటైజర్ పరికరం ఎలా పనిచేస్తుంది?, దీని వల్ల ఎంత వరకు ఉపయోగం ఉంది?
జవాబు: ప్రస్తుతం రెండు రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి బటన్స్ ద్వారా పనిచేయగా... మరొకటి సెన్సార్ల ద్వారా పనిచేస్తోంది. బాక్స్‌ను తెరిచి వస్తువులను అందులో ఉంచి బాక్స్‌ను క్లోజ్ చేసిన తర్వాత... అందులో ఏర్పాటు చేసిన బల్బుల ద్వారా అతినీలలోహిత కిరణాలు ప్రసరించి.. వైరస్‌ను అంతమొందిస్తాయి.
ప్రశ్న: అతినీలలోహిత కిరణాలతో శాటిటైజ్ చేయడం వల్ల వైరస్‌ను పూర్తిగా నశిస్తుందా?
జవాబు: ఈ పరికరం ద్వారా ఇప్పటికే పలు బాక్టీరియాలపై ప్రయోగం చేయగా...కేవలం మూడు నుంచి ఏడు నిమిషాల్లో వాటిని అంతమొందించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌పై ప్రయోగిస్తున్నాం.. అతినీలలోహిత కిరణాల ద్వారా వైరస్, బాక్టీరియా, ఫంగస్‌ను నివారించవచ్చని తెలిసిందే...
ప్రశ్న: ఇవి కేవలం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారా?
జవాబు: ప్రస్తుతం వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని పరికరాలు అవసరమవుతాయి. అవన్నీ రాగానే ఆస్పత్రి అంతా ఏర్పాటు చేస్తాం.
ప్రశ్న: ఈ పరికరాలు వైరస్ నివారణలో ఎంత వరకూ ఉపయోగపడొచ్చు?
జవాబు: వస్తువులను రసాయనాలతో శుభ్రం చేయడం వల్ల అవి పాడయ్యే అవకాశం ఉంది. దానితో పాటు రసాయనాల తయారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అతినీలలోహిత కిరణాలతో వస్తువులను శానిటైజ్ చేయడం సులభమైన ప్రక్రియ.
ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?