కొవిడ్ మహమ్మారి పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకదని పీవీ నరసింహారావు పశు విశ్వవిద్యాలయం వెటర్నరీ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ కె.సతీశ్ కుమార్ తెలిపారు. భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్ జంతు ప్రదర్శనశాలలో 8 సింహాలకు సార్స్-కోవ్2 వైరస్ సోకిన నేపథ్యంలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులే కాకుండా కోళ్లు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుందేళ్లు, కోతులకు కూడా వైరస్ వస్తుందన్న ఆందోళన నెలకొంది. ఈ వదంతులతో మూగజీవాల ప్రేమికులు, పాడిరైతులు ఆందోళనచెందాల్సిన అవసరంలేదని వైద్యులు అంటున్నారు.
మూగజీవాలకు కొవిడ్ సోకితే అందించాల్సిన చికిత్స, ఔషధాలపై రష్యాలో అధ్యయనాలు, క్లినికల్ ట్రయల్స్, టీకా తయారీ సాగుతున్నాయని పేర్కొన్నారు. పెంపుడు జంతువులు, మూగజీవాలకు కూడా పౌష్టికాహారం అందించాలని డాక్టర్ సతీశ్ కుమార్ సూచించారు.
ఇదీ చూడండి: రెండో డోసుకే పరిమితం చేసినా తీరని టీకా కష్టాలు