ETV Bharat / state

వ్యాక్సిన్‌ వచ్చినంత మాత్రాన వైరస్ పోదు: సీసీఎంబీ మాజీ డైరెక్టర్​ - తెలంగాణ తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డబుల్ మ్యూటెంట్ వైరస్ వేగంగా విస్తరిస్తోందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రాకేశ్ కే మిశ్రా పేర్కొన్నారు. కేసుల పెరుగుదలకు వైరస్​లో వచ్చిన మ్యూటేషన్లతోపాటు.... మానవ ప్రవర్తన కూడా ప్రధాన కారణంగా ఆయన తేల్చి చెప్పారు. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు సరైన చికిత్స విధానం లేదన్న ఆయన... కరోనా కోసం సీసీఎంబీ తయారు చేసిన మందులను మానవులపై ప్రయోగాలు చేసేందుకు డీసీఐజీ నుంచి అనుమతులు వచ్చినట్టు వివరించారు.

వ్యాక్సిన్‌ వచ్చినంత మాత్రాన వైరస్ పోదు: సీసీఎంబీ మాజీ డైరెక్టర్​

author img

By

Published : May 7, 2021, 10:49 PM IST

లక్షల కొద్ది కేసులు... వేల కొద్ది మరణాలు. ఒక్క రోజులో కరోనా సృష్టిస్తున్న విధ్వంసమిది. ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యాప్తి చెందుతూ పరిశోధకులకే సవాలు విసురుతోంది. ఇక మ్యూటేషన్‌లు సరే సరి. దాదాపు రెండు నెలలుగా ఈ ఉత్పరివర్తనాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కొత్త రకాల వైరస్‌లు వేగానికి కళ్లెం వేయటం సాధ్యం కావటం లేదు. ఈ పరిణామాలకు తోడు సింహాలకూ వైరస్ సోకిందని తేలటం ఇంకా కలవరపాటుకు గురి చేసింది. ఎన్​440కే వైరస్ రకం విస్తరించటం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందన్న వార్తలొస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్న చర్చలూ జరుగుతున్నాయి. మరి ఇందులో వాస్తవమెంత..? జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రమాదముందా..? భారత్‌లో ఏ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంది..? ఈ విషయాలన్నింటినీ వివరిస్తున్నారు...సీసీఎమ్‌బీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె. మిశ్రా. త్వరలోనే డబుల్ మ్యూటెంట్ కేసులూ పెరిగే ముప్పు పొంచి ఉందని చెబుతున్న రాకేశ్ మిశ్రాతో ప్రత్యేక ముఖాముఖి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.