ETV Bharat / state

నమ్మకంగా ఉంటారు.. అదును చూసి దోచేస్తారు...

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్​రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్​రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Interstate burglary gang arrest
అంతర్​రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​
author img

By

Published : Feb 12, 2020, 5:44 PM IST

Updated : Feb 12, 2020, 11:24 PM IST

పనివాళ్లుగా ఇళ్లలో చేరి దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గుర్ని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా బిహార్‌లోని మదుబని జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు రామాశిష్‌ ముఖియా, భాగవత్‌ ముఖియా, భోళా ముఖియాల నుంచి రూ. 1.50 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు.

రెక్కీ నిర్వహించి తర్వాతే చోరీ

ప్రధాన నిందితుడు భోలా ముఖియా వృత్తిరీత్యా డ్రైవర్‌. ఎప్పుడు, ఎక్కడ చోరీ చేయాలనేది ఇతడే నిర్ణయిస్తాడు. చోరీకి పాల్పడాలని నిర్ణయించుకున్న తర్వాత రెక్కీ నిర్వహించి ఒక కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకుంటారు. కొన్ని రోజుల పాటు అనేక విధాలుగా పరీక్షించిన తర్వాతనే దొంగతనం చేయాలని నిర్ణయిస్తారు. ఆ తర్వాత చోరీ చేయాలనుకునే సమయానికి 10 నుంచి 15 రోజుల ముందు మిగతా ముఠా సభ్యులకు సమాచారం ఇస్తారు.

అంతర్​రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​

పథకం ప్రకారమే

అనంతరం వారు కూడా రంగంలోకి దిగుతారు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం ముఠాలో ఒకడు డ్రైవర్‌గా, ఇంట్లో పనివాడిగా అక్కడ చేరిపోతాడు. ఆ తర్వాత అనుకున్న విధంగా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు. ముఠాను పట్టుకోవడంలో పనిచేసిన బంజారాహిల్స్‌ డీఐ కె.రవికుమార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ భరత్‌ భూషణ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శేఖర్‌, కానిస్టేబుల్‌ జయరాజ్‌, అహ్మద్‌, శివశంకర్‌, హోంగార్డ్‌ కిషన్‌ నాయక్‌లను సీపీ అభినందించారు.

అంతర్​రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​

ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

Last Updated : Feb 12, 2020, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.