ETV Bharat / state

Yoga Day Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగిన యోగా దినోత్సవ వేడుకలు

International Yoga Day Celebrations : రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేస్తే మంచి జీవితాన్ని పొందొచ్చని పలువురు సూచించారు. యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ అంటే పెద్దపెద్ద ఆసుపత్రులు కట్టడంలో ఉండదని.. ప్రజలు ఆసుపత్రికి వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Yoga Festival in Telangana
Yoga Festival in Telangana
author img

By

Published : Jun 21, 2023, 1:40 PM IST

International Yoga Day Celebrations in Telangana : యోగా వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పేర్కొన్నారు. సంగారెడ్డిలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి బీజేపీ శ్రేణులు, వివిధ సంస్థల ప్రతినిధులతో కలిసి ఆసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నల్లు ఇంద్రసేనారెడ్డి సహా పలువురు నేతలు ఆసనాలు వేశారు.

హైదరాబాద్‌ చార్మినార్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పలువురు నేతలు, కార్యక్రమాలు పాల్గొన్నారు. యోగా చేయం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యావత్ ప్రపంచాన్ని యోగా దినోత్సవం పాటించేలా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి అచెంచలమైనదని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని సమతాభవన్‌లో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా యోగ దినోత్సవం పాటించడం అభినందనీయమని యాంత్రిక జీవనంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు యోగ దివ్య ఔషధమని లక్ష్మణ్‌ తెలిపారు.

మహబూబ్‌నగర్‌లో ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. అందరితో కలిసి యోగాసనాలు వేసిన మంత్రి.. జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య తెలంగాణ అంటే పెద్దపెద్ద ఆస్పత్రులు కట్టడంలో ఉండదని.. ప్రజలు ఆస్పత్రికి వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మన ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజూ ఒక్క గంట సమయం కేటాయించి యోగా, ప్రాణాయామం చేస్తే మంచి జీవితాన్ని పొందొచ్చని హరీశ్‌రావు సూచించారు.

Minister Harishrao at Yoga Day celebrations : సిద్దిపేటలోని క్రికెట్‌ స్జేడియటంలో జరిగిన వేడుకలు మంత్రి హరీశ్‌రావు హాజరై ఆసనాలు వేశారు. ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం పటేల్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ గౌతమ్‌ యోగా సాధన చేశారు. పెవిలియన్‌ మైదానంలో యోగా వేడుకలు ఉత్సహంగా నిర్వహించారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎన్​సీసీ ఆధ్వర్యంలో యోగాదినోత్సవం జరిపారు. పెద్దలతో పాటు మహిళలు, యువతీ, యువకులు పాల్గొన్నారు. నిత్యజీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను జయించేందుకు అవసరమైన ఆసనాలు నేర్పించారు.

International Yoga Day Celebrations : నిర్మల్‌లో వశిష్ట యోగసంఘటన్ వసుధైవకుటుంబం ఆధ్వర్యంలో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ కంటి వైద్యనిపుణులు కృష్ణంరాజు తెలిపారు. కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో యోగా శిబిరాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. మౌలాలిలోని దక్షిణ మధ్య రైల్వే జోనల్ రైల్వే శిక్షణ సంస్థలో ఏర్పాటు చేసిన తొమ్మిదో ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమంలో సుమారు 500 మంది రైల్వే ట్రైనీలు పాల్గొన్నారు.

రోజు గంటపాటు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. యాంత్రిక జీవనంలో విసిగివేసారే వారికి యోగా ఉపశమనాన్ని కలిగిస్తుందని వివరించారు. రోజు యోగా చేయడం ద్యారా ఎన్నో ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఎల్​ఐసీ రీజినల్ మేజనర్ రవికుమార్‌ సూచించారు. హైదరాబాద్‌లోని ఎల్​ఐసీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయంలో యోగా వేడుకలు నిర్వహించారు. ఉద్యోగులతోపాటు వారి కుటంబసభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.