మహిళలు ఎప్పుడు తక్కువ కాదని.. నేటి సమాజంలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి అన్నారు. మగవారు చేసే ప్రతి పనుల్లో ఆడవాళ్ల అండదండలు ఉంటేనే మరింత ముందుకు సాగుతున్నారన్నారని కొనియాడారు.
భారతీయ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. రవీంద్రభారతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీ ఆర్టిస్ట్స్ కుమారి శీర్ష, లక్ష్మి వర్మలతో కలిసి అదిరే అభి పాల్గొన్నారు. వారితో పాటు పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా హాజరయ్యారు.
వాసవీ ఫిలిం అవార్డ్స్, మదర్ తెరెసా సేవ పురస్కారాలు పేరిట.. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ముఖ్య అతిథిల సమక్షంలో నిర్వాహకులు డాక్టర్ కె.వి.రమణ రావు, లలిత రావు ఘనంగా సన్మానించారు. వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన వివిధ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.
ఇదీ చూడండి: ప్రమాదకర విన్యాసాలు చేసి... స్టంట్ ఉమెన్‌గా మారి