ETV Bharat / state

HandBall: 'ప్రభుత్వం సహకారంతో ప్రతి జిల్లాకు అకాడమీ' - హ్యాండ్​ బాల్ క్రీడకు పూర్వ వైభవం

దేశంలో హ్యాండ్​బాల్ క్రీడకు మునుపెన్నడు లేనంతగా క్రేజ్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని జాతీయ హ్యాండ్​బాల్ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్​ మోహన్​ రావు అన్నారు. హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ హ్యాండ్‌బాల్ డే వేడుక‌ల‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

International handball day
ఎల్బీ స్టేడియంలో వేడుకలు
author img

By

Published : Jun 24, 2021, 10:56 AM IST

కేంద్ర‌, రాష్ట్ర క్రీడా శాఖ‌లు, భార‌త ఒలింపిక్ సంఘం స‌హ‌కారంతో హ్యాండ్‌బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకోస్తామని జాతీయ హ్యాండ్‌బాల్ అధ్య‌క్షుడు అరిశ‌న‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్‌రావు చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ హ్యాండ్‌బాల్ డే వేడుక‌ల‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. దేశంలో హ్యాండ్​బాల్​ క్రీడకు మునుపెన్నడు లేనంతగా క్రేజ్​ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ప్ర‌తీ జిల్లాలో ఒక హ్యాండ్‌బాల్ అకాడ‌మీని పెట్టేందుకు ఆలోచ‌న చేస్తున్నామ‌ని వివరించారు. 1970వ ద‌శ‌కంలో హ్యాండ్‌బాల్‌కు హైద‌రాబాద్ హ‌బ్‌గా ఉండేద‌ని తెలిపారు. మరల పూర్వ వైభవాన్ని సాధించేందుకు కోచ్‌లు, సీనియ‌ర్ క్రీడాకారుల‌తో క‌లిసి ప‌నిచేస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

అధునాత‌న స‌దుపాయాల‌తో న‌గ‌రంలో ఒక ఇండోర్‌ హ్యాండ్‌బాల్ స్టేడియంతో పాటు దానికి అనుబంధంగా అకాడ‌మీ ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు. 2024 ఒలింపిక్స్​కు భార‌త జ‌ట్టు అర్హ‌త సాధించాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నామని జగన్​ మోహన్​రావు వెల్లడించారు. అందుకు తగిన ప్రణాళికతో క్రీడాకారులు క‌ష్ట‌ప‌డి రాణించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి, ప్ర‌తిష్ట‌లు తీసుకురావాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రావు సూచించారు.

ఇదీ చూడండి: 'క్రీడల అభివృద్ధికి రాష్ట్రవ్యాప్తంగా మినీ స్టేడియాల నిర్మాణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.