హైదరాబాద్ వేదికగా సాగుతున్న తమ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని బయోలజికల్ ఈ(Biological E) సంస్థ విస్తరించటంతో పాటు... యూఎస్‌కి చెందిన ఇంటర్నేషనల్ డెవలెప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(Development Finance Corporation- DFC)తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బయోలజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల(MD Mahima datla)తో పాటు డీఎఫ్‌సీ సీఈఓ డేవిడ్ మార్చిక్, యూఎస్ కాన్సూల్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వాణీరావు, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
డీఎఫ్‌సీ(DFC)తో వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం 50 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కోసం బయోలజికల్ ఈ ఎంఓయు- అవగాహన ఒప్పందం(Memorandum of understanding) కుదుర్చుకుంది. ఈ మొత్తాన్ని వ్యాక్సిన్(Vaccine) ఉత్పత్తి కేంద్రం విస్తరణ, వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం వినియోగించనున్నటు మహీమా దాట్ల ప్రకటించారు.
ఈ మూలధనాన్ని ఒక్క వ్యాక్సిన్ ఉత్పత్తి కోసమే కాకుండా.. వివిధ రకాలైన సాంకేతికతను ఉపయోగించి కొవిడ్ టీకాలను ఉత్పత్తిని విస్తరిస్తాం. ఈ విషయంలో డీఎఫ్‌సీతో కలిసి పనిచేయడాన్ని గొప్పగా భావిస్తున్నాం. మేం త్వరలో బిలియన్ల డోసులను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. -మహిమా దాట్ల, ఎండీ, బయోలజికల్ ఈ సంస్థ
ప్రాజెక్టు కోసం అంతా కష్టపడ్డాం. ప్రపంచవ్యాప్తంగా వేలాదిగా వర్చువల్ సమావేశాలు నిర్వహించాం. మీతో ఈ ఆర్థిక లావాదేవీని ఒక మిషన్‌గా భావించి ముందుకెళ్తున్నాం. మహిమా ప్రపంచ స్థాయి యువ పారిశ్రామికవేత్త. ఆమె ఎటువంటి సమయంలోనైనా సమాచారం ఇచ్చి పుచ్చుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. -డేవిడ్ మార్చిక్, సీఈవో, డీఎఫ్‌సీ
ఇదీ చదవండి: Varavara Rao: వరవరరావుపై కర్ణాటక కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్