ETV Bharat / state

IAMC: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ - hyderabad

తీర్పులు, న్యాయం చెప్పడానికి కోర్టులు, న్యాయ పట్టాలే అవసరం లేదని.. సమస్యను అర్థం చేసుకోగలిగి.. సామాజిక గుర్తింపు, విశ్వసనీయత ఉన్న వారెవరైనా అర్హులేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. వివాదాల పరిష్కారానికి ఆర్బిట్రేషన్, మీడియేషన్ వంటి విధానాలకే ప్రపంచవ్యాప్తంగా మొగ్గు చూపుతున్నారన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారానికి ప్రయత్నించిన తర్వాతే... చివరి ప్రయత్నంగా కోర్టులకు వెళ్లాలని జస్టిస్ రమణ సూచించారు. హైదరాబాద్ లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం.. ఐఏఎంసీని ఈనెల 18న ప్రారంభించనున్నట్లు జస్టిస్ ఎన్.వి.రమణ వెల్లడించారు. ఐఏఎంసీ ప్రపంచంలోనే గొప్ప కేంద్రంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమిని కేటాయించనున్నట్లు ప్రకటించారు.

IAMC: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

author img

By

Published : Dec 5, 2021, 3:32 AM IST

IAMC: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

హైదరాబాద్​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ఈనెల 18న ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వెల్లడించారు. హెచ్ఐసీసీలో జరిగిన ఐఏఎంసీ సన్నాహక సమావేశంలో సీజేఐ జస్టిస్ రమణ కీలకోపన్యాసం చేశారు. పాండవులు, కౌరవుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు శ్రీకృష్ణుడు ప్రయత్నించాడని... మధ్యవర్తిత్వం విఫలమైతే విపత్తులకు దారి తీస్తుందనేందుకు మహాభారతమే ఉదాహరణ అని సీజేఐ పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో వివాదం తలెత్తితే నచ్చని వారికి దూరంగా ఉండటమో.. అవసరమైతే కొంత డబ్బు, ఆస్తిని వదులుకుంటారన్నారు. కానీ వ్యాపారంలో డబ్బు, ప్రతిష్టగా పణంగా పెట్టలేరని.. అందుకే త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటారని సీజేఐ జస్టిస్ ఎన్​.వి. రమణ పేర్కొన్నారు. అయితే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల తర్వాతే.. చివరి ప్రయత్నంగా కోర్టులను ఆశ్రయించాలని... తన 40 ఏళ్ల అనుభవంతో సూచిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కోర్టులకెక్కితే వివిధ ప్రక్రియలతో మరింత నష్టపోతారని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్బిట్రేషన్, మీడియేషన్ వంటి విధానాలతో వివాదాలు పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపుతున్నారన్నారు.

మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు

‘కోర్టులకు వచ్చే ముందు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉంది. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చు. ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతోంది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక. సాధ్యమైనంత వరకు మహిళలు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి. విస్తృత సంప్రదింపులతో ఇరు పక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం సాధ్యం. -జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఐఏఎంసీ ట్రెండ్ మార్చబోతోంది..

హైదరాబాద్​లోని ఐఏఎంసీ ట్రెండ్ మార్చబోతున్నదని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ నిపుణులు కేంద్రంలో పాలుపంచుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రస్తుతం పారిస్, సింగపూర్, హాంకాంగ్, న్యూయార్క్ వంటి వాణిజ్య హబ్​లలోనే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్​లో అనేక పరిశ్రమలు.. సదుపాయాలు ఉన్నాయని.. వాటికి తోడు ఇక్కడి ప్రజలు సాదరంగా స్వాగతిస్తారని... అందుకే ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీజేఐ తెలిపారు. జూన్​లో ప్రతిపాదన తెలపగానే సీఎం అంగీకరించడంతో తన స్వప్నం సాకారమవుతోందన్నారు. తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తే... చట్టాల్లో మార్పుల్లో భాగంగా తెలుగు బిడ్డ పీసీ రావు ఆర్బిట్రేషన్ చట్టాన్ని రూపకల్పన చేశారన్నారు. న్యాయం, తీర్పులు చెప్పడానికి కోర్టులే.. న్యాయ పట్టాలు అవసరం లేదని సీజేఐ జస్టిస్​ ఎన్​.వి.రమణ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, అధికారులతో పాటు సమాజంలో గుర్తింపు, విశ్వసనీయత ఉన్న వ్యక్తులు కూడా సమస్యను అర్థం చేసుకొని తీర్పు చెప్పవచ్చనన్నారు. గరికపాటి, నాగఫణి శర్మ వంటి వారు కూడా ఆర్బిట్రేషన్ కేంద్రంలో భాగస్వాములు కావాలని సీజేఐ సూచించారు. పారిశ్రామిక వివాదాలే కాకుండా కుటుంబ సమస్యలు, సామాన్యుల వివాదాలను కూడా సరళమైన పద్ధతుల్లో పరిష్కరించవచ్చునన్నారు.

శాశ్వత భవనం పుప్పాలగూడలో..

ఐఏఎంసీ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక కేంద్రంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్​లో ఐఏఎంసీ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలకు సీజేఐ జస్టిస్​ ఎన్​.వి.రమణకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో రచ్చబండ వంటి పద్ధతుల్లో ఎప్పటి నుంచో ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార విధానం అందుబాటులో ఉందన్నారు. కొంత ఆలస్యంగానైనా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రంలో హైదరాబాద్​లో ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదుగుతోందన్నారు.. ఇక్కడ అనేక ఫార్చూన్ 500 సంస్థలు ఉన్నాయన్నారు. ఐఏఎంసీ కోసం వెంటనే 25వేల చదరపు అడుగుల కేంద్రాన్ని తాత్కాలికంగా సమకూర్చామని... శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో త్వరలో భూమిని కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

రచ్చబండ నుంచే..

"ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు ధన్యవాదాలు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉంది. పలు కారణాలతో పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషం. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతం." - కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి

అత్యుత్తమ పారిశ్రామిక విధానం

ఐఏఎంసీకి అనుబంధంగా జిల్లాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. ఐఏఎంసీ వల్ల రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చాలా ఉపయోగమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో భాగంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా టీఎస్ఐపాస్ అందుబాటులోకి తెచ్చామని.. దాని వల్ల 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెలంగాణలో సీఎం కేసీఆర్​ మార్గదర్శకత్వంలో రూపొందింది. అన్ని దేశాల్లోనూ అధ్యయనం చేసి టీఎస్​ఐపాస్​ తీసుకొచ్చాం. ఐఏఎంసీ ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరిస్తాం. ఐఏఎంసీకి అనుబంధంగా జిల్లాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. -కేటీ రామారావు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ నరసింహా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఐఏఎంసీ జీవితకాల ట్రస్టీ ఆర్.వి.రవీంద్రన్, న్యాయవాదులు, ఆర్బిట్రేషన్ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.