కరోనా తీవ్రత కారణంగా ఈనెల 7 నుంచి రెండో సంవత్సరం విద్యార్థులకు జరగాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. థియరీ, జేఈఈ నాలుగో విడత మెయిన్ పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
వాయిదా పడిన ప్రయోగ పరీక్షలను మే 29 నుంచి జూన్ 7 వరకు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బ్యాచ్‌ల వారీగా టైం టేబుల్ తర్వాత ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.
ఇదీ చదవండి: 'అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు'