Intermediate Exams Will Start Tomorrow: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్.. ప్రతి జిల్లాలోని అన్ని విభాగాల వారిని సమన్వయం చేస్తూ కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని జిల్లాల కలెక్టర్లకు వర్చువల్ మీటింగ్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల సమయాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
"ప్రతి జిల్లాలో జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు చేశాము. ఈ కమిటీకి డీఐఓ తనిఖీ కన్వీనర్‌గా ఉంటారు. పెద్ద జిల్లాలో అయితే ఇద్దరు సీనియర్ ప్రిన్సిపల్స్, చిన్న జిల్లాల్లో అయితే ఒక సీనియర్ ప్రిన్సిపల్ ఉంటారు. ఒక జూనియర్ లెక్చరర్ ఉంటారు. ఈ నలుగురు ఈ ఎగ్జామినేషన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు ఎగ్జామినేషన్ సెంటర్లో సమస్యలను చూసుకుంటారు. ఆర్టీసీ బస్సులను పరీక్ష సమయానికి ముందే తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు ఆ శాఖ మంత్రి కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇంటర్ విద్యార్థులు ఎక్కువగా ఎక్కే.. రూట్లలో బస్సులను పెంచాలి." - నవీన్ మిత్తల్, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్
నిమిషం నిబంధన అమలు: ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4తో ఈ పరీక్షలు ముగియనున్నాయి. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష జరిగిన అన్ని రోజులు ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా సెంటర్లోకి అనుమతించరు. దీంతో పక్కాగా ఒక్క నిమిషం నిబంధన అనేది అమలవనుంది.
Inter Board Exams: బోర్డు నిబంధనల ప్రకారం ఉదయం ఉదయం 8.45 నుంచి 9 గంటల మధ్యలోనే ఓఎంఆర్ షీట్‌ను విద్యార్థులు నింపాలని తెలిపింది. ఓఎంఆర్ పత్రం ఇవ్వగానే అందులో మీ పేరు, హాల్ టికెట్ నంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలని బోర్డు తెలుపుతుంది. ఈ పరీక్షలకు 9,47,699 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
రెండో ఏడాది చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 29వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. మాస్ కాపింగ్‌కు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు పేర్కొంది. ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే అందులో 24 పేజీలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చింది.
ఇవీ చదవండి: