ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. మొత్తం 9 లక్షల 65 వేల మంది విద్యార్థుల్లో... 95.72 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 436 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1339 పరీక్ష కేంద్రాల్లో 26 వేల 964 మంది ఇన్విజిలేటర్లు, 225 మంది స్క్వాడ్ లతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.
ఇవాళ రెండో సంవత్సరం పరీక్ష ఒక్క రోజే రాష్ట్రంలో 60 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 35, హైదరాబాద్, సంగారెడ్డిలో ఎనిమిది, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్లో రెండు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డిలో ఒకటి చొప్పున నమోదయ్యాయి.
ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్