ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

author img

By

Published : Mar 18, 2020, 2:03 PM IST

Updated : Mar 18, 2020, 2:58 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్​ ​ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 4న ప్రారంభమైన పరీక్షలు 14 రోజులపాటు జరిగాయి. పరీక్షలు అన్నీ ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల వద్ద సందడి వాతావరణం కన్పించింది.

intermediate exams completed in telangana
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంటర్​ ద్వితీయ సంవత్సరం ప్రధాన గ్రూపుల పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనాకు భయపడుతున్నా.. విద్యార్థులపై ఆ మహమ్మారి ప్రభావం పడకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో తగు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.

ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు..

పరీక్షా కేంద్రాల నుంచి విద్యార్థులు బయటకు వస్తూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాలన్నీ విద్యార్థులతో సందడిగా మారాయి. ఓ వైపు వీడిపోతున్నామనే బాధ , మరో వైపు పరీక్షలు అయిపోయాయనే ఆనందంతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ తమ ఇళ్లకు బయలుదేరారు.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

ఇదీ చదవండిః దిశ తరహా ఘటనపై ఎన్నెన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు..

Last Updated : Mar 18, 2020, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.