ETV Bharat / state

'తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే దోచేస్తాడు' - అంతరాష్ట్ర దొంగ అరెస్టు

అతనో ఎలక్ట్రిషియన్. మార్వాడి వద్దకు వెళ్లి బంగారం భారీ మొత్తంలో విక్రయిస్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా.. నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. చోరీల్లో ఆరితేరిన ఈ ఎలక్ట్రిషియన్ వద్ద సుమారు 700 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

CHORI
CHORI
author img

By

Published : Jan 11, 2020, 12:48 PM IST

దొంగగా మారిన ఎలక్ట్రిషియన్​

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఎలక్ట్రిషియన్‌ దొంగతనాల బాట పట్టాడు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి హైదరాబాద్​ అబిడ్స్‌ పోలీసులకు అప్పగించారు.

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కథనం ప్రకారం...
మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఒమర్‌ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆరు నెలల ఎలక్ట్రిషియన్‌ కోర్సులో శిక్షణ పొందాడు. అక్కడ సరిగ్గా పనులు లేకపోవడం వల్ల కుటుంబంతో కలిసి 1993లో నగరానికి వచ్చాడు. ఫలక్‌నుమా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ కరంట్ పనులు చేసేవాడు. స్నేహితులతో పరిచయాలు, ఇతర కారణాలతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బు సరిపోకపోవడం వల్ల తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. అలా 13కు పైగా దొంగతనాలు చేశాడు.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. గత ఏడాది డిసెంబర్‌ 31న అపహరించిన బంగారాన్ని విక్రయించేందుకు పాట్‌ మార్కెట్‌కు వచ్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో విచారణ నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 579 గ్రాముల బంగారు నగలు, 1,510 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.45 వేల నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్​ఫోర్స్​ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్​రావు వెల్లడించారు.

ఇవీ చూడండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..తాళాలు వేసే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు..విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఎలక్ట్రీషియన్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు..చివరికి కటకటాలపాలయ్యాడు.అతని నుండి 579 గ్రాముల బంగారం,1519 గ్రాముల వెండి, 45 వేల రూపాయల నగదు,ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు ..మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఒమర్ పదవ తరగతి వరకు చదువుకున్నాడు..ఆరు నెలల పాటు ఎలక్ట్రిషన్ కోర్సులో శిక్షణ పొందినట్లు పోలీసులు తెలిపారు..సరైన ఉపాధి లేక పోవడంతో కుటుంబంతో కలిసి గత కొన్ని నెలల క్రితం హైదరాబాదు నగరానికి వచ్చాడు..ఫలక్నామ వద్ద నివాసముంటూ ఎలక్ట్రీషియన్గా జీవనం సాగించేవాడు అని పోలీసులు పేర్కొన్నారు..స్నేహితులతో పరిచయాలు ఇతర కారణాల వల్ల విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు..డబ్బు ఇబ్బంది ఉండడంతో చోరీలు చేయడం ప్రారంభించాడు..ఈ విధంగా 13 దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు..బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు సిసి ఫుటేజీలను పరిశీలించారు..గత నెల 31వ తేదీన బంగారం విక్రయించేందుకు పాట్ మార్కెట్కు వచ్చిన సమయంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.. Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.