ETV Bharat / state

జూన్​ 15లోగా ఇంటర్​ ఫలితాలు - Inter board Latest News

జూన్​ 15లోగా ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ కోసం ఈనెల 11న వెబినార్ నిర్వహించనున్నామని... వెబినార్ లింక్​ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ వెబినార్​ను హిందీ మహా విద్యాలయ, ఐసీఏఐతో సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియట్ కామర్స్ సిలబస్, కోర్సు కంటెంట్​లో... ఐసీఏఐతో కలిసి పలు మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు జలీల్ చెప్పారు.

inter results on June 15th
జూన్​ 15లోగా ఇంటర్​ ఫలితాలు
author img

By

Published : Jun 5, 2020, 7:25 PM IST

ఇంటర్మీడియట్​ పరీక్షా ఫలితాలను ఈనెల 15లోగా వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ కోసం ఈనెల 11న వెబినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హిందీ మహా విద్యాలయ, ఐసీఏఐతో సంయుక్తంగా వెబినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెబినార్ లింక్​ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని... సీఏ, లైఫ్ సైన్సెస్, వొకేషనల్, తదితర విభాగాల్లోని అవకాశాలపై చర్చించనున్నామని వివరించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్​నే సీఏ ఫౌండేషన్​కు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఐసీఏఐ కేంద్ర కౌన్సిల్ సభ్యుడు దయానివాస్ శర్మ తెలిపారు. ఇంటర్మీడియట్ కామర్స్ సిలబస్, కోర్సు కంటెంట్​లో... ఐసీఏఐతో కలిసి పలు మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు జలీల్ చెప్పారు.

ఇదీ చూడండి : భూ యజమానులకు 10శాతం వాటా పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.