ఇంటర్మీడియట్ అడ్మిషన్ షెడ్యూలు ప్రకటించక ముందే.. చేపట్టే ప్రవేశాలు చెల్లవని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పష్టం చేశారు. ముందస్తు ప్రవేశాలు చేపట్టే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గుర్తింపు పొందిన కళాశాలల జాబితా ప్రకటించక ముందే తమ పిల్లలను చేర్పించవద్దని తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు సూచించింది. కళాశాలకు గుర్తింపు ఉందా లేదా అనే అంశం ముందుగా పరిశీలించి... నిర్ధరించుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:ఆ కళాశాలలపై చర్యలెందుకు తీసుకోలేదు: హైకోర్టు