ఈ ఏడాది ఒక్క ఇంటర్ విద్యార్థి కూడా ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల అధ్యాపకులను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ కోరారు. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగాలని కోరుకుందామన్నారు. హైదరాబాద్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో నియమించిన కౌన్సిలర్లకు రెండో విడత శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు.
విద్యార్థులను అర్థం చేసుకుని.. వారిని తీర్చిదిద్దడంలో కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించాలని జలీల్ కోరారు. త్వరలో ఆడియో, వీడియో తరగతులను ఇంటర్ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్, సి.వీరేందర్, గంపా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ సమావేశం