ETV Bharat / state

ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం హైదరాబాద్​ గన్​ఫౌండ్రీలోని మహబూబియా కళాశాలలో ప్రారంభమైంది. ముందుగా ఇంటర్​ రెండో సంవత్సరం మూల్యంకనం పూర్తి చేసి.. మొదటి సంవత్సరం పేపర్లు దిద్దనున్నారు.

inter answer sheets correction started in telangana
ప్రారంభమైన ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనం
author img

By

Published : May 12, 2020, 10:26 AM IST

హైదరాబాద్​ గన్​ఫౌండ్రీలోని మహబూబియా కళాశాలలో మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ ఏడాది 9.5 లక్షల మంది ఇంటర్​ పరీక్షలు రాయగా.. అధ్యాపకులు మొత్తం 55 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు.

ముందుగా రెండో సంవత్సర విద్యార్థుల పత్రాలు..

ముందుగా ఇంటర్​ రెండో ఏడాది జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత మొదటి ఏడాది పేపర్లను అధ్యాపకులు దిద్దనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 33కు పెంచారు. విధుల్లో 15 వేల మంది అధ్యాపకులు పాల్గొంటుండగా.. ఒక్కొక్కరికి మూడు మాస్కులు, శానిటైజర్లు, పోలీసు పాస్​లను ప్రభుత్వం అందజేసింది. జూన్​ రెండో వారంలో ఇంటర్​ ఫలితాలు ప్రకటించే అవకాశముంది.

ఇదీ చదవండిః హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.