ETV Bharat / state

బీమా ఉన్నా సొమ్ము కడితేనే కరోనాకు చికిత్స - కరోనా చికిత్స వార్తలు

నిబంధనల ప్రకారం ఇప్పటికే తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీల్లో కరోనా చికిత్సలకు పరిహారం ఇవ్వాలని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐఆర్‌డీఏ) ప్రకటించింది. పీపీఈ కిట్లు, అదనపు ఖర్చులు బీమా పరిహారం కిందకు రావు. డిశ్ఛార్జి సమయంలో అదనపు ఛార్జీలన్నీ రోగులే భరించాలి. ఇవీ రూ.లక్షల్లోనే ఉంటున్నాయి. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పలు ఆసుపత్రులు పూర్తిగా బీమానే పక్కన పెడుతున్నట్లు సమాచారం.

corona
corona
author img

By

Published : Jul 3, 2020, 6:54 AM IST

మనకి ఆరోగ్య బీమా ఉంది.. చేతిలో డబ్బు లేకపోయినా చికిత్సకు డోకా లేదన్న దీమాతో ఉన్నారా? అవేవీ ఇక్కడ పనిచేయవంటున్నాయి కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు. డబ్బు కడితేనే పడక ఇస్తామని చెబుతున్నాయి. కరోనా సోకి పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా ముందుగా సొమ్ము చెల్లిస్తేనే చేర్చుకుంటున్నాయి. వివిధ ఛార్జీల మోత మోగిస్తున్నాయి. పడక కావాలంటే ముందే కనీసం రూ.లక్ష డిపాజిట్‌ కట్టాలని చెబుతున్నాయి. ఆరోగ్య బీమా ఉందని చెప్పినా వినడంలేదు. నాయకులు, ఉన్నతాధికారులతో సిఫారసులు చేయించుకుంటే తప్పదన్నట్లు అంగీకరిస్తున్నాయి. వేరే దారి లేక కొందరు డబ్బు చెల్లించి చేరుతున్నారు. లేనివారు ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

లక్షల్లో బిల్లులు

కొవిడ్‌ చికిత్సల్లో పలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం చెప్పిన నిర్ణీత ఛార్జీలు అమలు కావడంలేదు. జ్వరం, ఆయాసం వంటి లక్షణాలుంటే చాలు రెండు, మూడు రోజులకే రూ.లక్ష బిల్లు దాటుతోంది. ఐసీయూ, వెంటిలేటర్‌ పేరిట వడ్డించేస్తున్నారని పలువురి ఆరోపణ. గ్రేటర్‌లో రోజూ 800-900 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొందరిలో ఏ లక్షణాలు కనిపించకపోయినా ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. బాధితుల సంఖ్యతో పోల్చితే పడకలు చాలక డిమాండ్‌ పెరుగుతోంది. ఇదే నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది.

ఆపత్సమయంలో అక్కరకు రాని బీమా

అనుకోకుండా వచ్చిపడే వైద్య ఖర్చులను భరించలేకే చాలా మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటాయి. ఇది కరోనాకు అక్కరకు రావడంలేదని వాపోతున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారు కనీసం 4-7 రోజులు ఆసుపత్రిలో ఉండాలి. ఆరోగ్యం విషమిస్తే 10-15 రోజుల చికిత్స తప్పదు. ఇన్ని రోజుల ఖర్చులు భరించడం ఎవరి వల్లా కాదు. ఆరోగ్య బీమా ఉంటే కొంత రక్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఏళ్లుగా వేలకు వేలు చెల్లించి పాలసీలు తీసుకుంటే... కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు తిరస్కరించడం ఏమేరకు సబబని ప్రశ్నిస్తున్నారు.

ఇక కరోనా వచ్చి లక్షణాలు లేనివారు హోంక్వారంటైన్‌లో ఉన్నా ఫోన్ల ద్వారా వైద్యసాయం అందిస్తామని కొన్ని ఆసుపత్రులు సూచిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో బయటపడవచ్చంటున్నాయి.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.