ETV Bharat / state

తిరిగిన కిలోమీటర్ల మేరకే బీమా ప్రీమియం చెల్లింపు - Motor insurance policy as run the vehicles

కొవిడ్‌ కార‌ణంగా ప్రయాణాలు తగ్గిపోయాయి. చాలావరకు వాహ‌నాలు ఇంటికే ప‌రిమిత‌మైపోతున్నాయి. ఫ‌లితంగా బండ్లు తిరిగే కిలోమీట‌ర్లు త‌గ్గిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో వాహ‌న బీమా భారాన్ని తగ్గించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కంపెనీలు. న‌డిపిన కిలోమీట‌ర్ల మేరకే బీమా చెల్లింపును అందుబాటులోకి తెచ్చాయి. ఐతే ఎంత మేరకు ప్రీమియం చెల్లించాలి? ఒక వేళ నిర్ణయించుకున్న కిలోమీటర్ల పరిమితి దాటితే ఏం చేయాలి? అనే అంశంపై విషాలేంటో చుద్దాం.

Insurance premium payment per kilometer traveled system
తిరిగిన కిలోమీటర్ల మేరకే బీమా ప్రీమియం చెల్లింపు
author img

By

Published : Aug 5, 2020, 3:31 PM IST

తిరిగిన కిలోమీటర్ల మేరకే బీమా ప్రీమియం చెల్లింపు

దేశంలో ఇప్పుడు నడిపించిన మేరకే మోటారు బీమా పాల‌సీ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఏడాదిలో ఎన్ని కిలోమీట‌ర్లు నడుపుతామని వాహ‌న‌దారుడు అంచనా వేసుకుంటారో ఆ మేరకే బీమా చేసుకోవచ్చు. 'పే-యాజ్-యూ-డ్రైవ్‌"గా చెబుతున్న ఈ ఇన్సూరెన్స్‌పై కంపెనీలు ప్రచారం ప్రారంభించాయి. ఎప్పుడూ రోడ్లపై తిరిగే డ్రైవర్లు కాకుండా.... మిగిలిన వారు వాహ‌న బీమా ఖ‌ర్చును త‌గ్గించుకోవ‌డానికి మంచి అవకాశంగా చెబుతున్నాయి. ఎడెల్ వైజ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌లో వాహన య‌జ‌మానులు బీమాను ఉప‌యోగించే ఆధారంగా ఆన్, ఆఫ్ చేసుకోవ‌చ్చు. ఇది ఫ్లోట‌ర్ పాల‌సీ కావ‌డంతో ఒకే పాల‌సీ కింద ప‌లు వాహ‌నాల‌కు కూడా క‌వ‌రేజి పొందవచ్చు. వాహ‌నాన్ని ఉప‌యోగించిన మేరకే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాల‌సీ స్వీచ్ ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే ప్రమాద డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఐతే అగ్నిప్రమాదం, చోరీకి సంబంధించిన ఘ‌ట‌న‌ల‌కు కవరేజీ ఏడాదిపాటు వర్తిస్తుంది.

కిలోమీట‌ర్లు డ్రైవ్ చేస్తార‌నే అంచ‌నా

ఐఆర్​డీఏఐ శాండ్ బాక్స్ ప్రాజెక్ట్ కింద భార‌తీ యాక్సా జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ సంస్థ పే-యాజ్-యూ-డ్రైవ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. ఇందులో థ‌ర్డ్‌ పార్టీ ప్రీమియాన్ని ఐఆర్​డీఏఐ నిబంధ‌న‌ల ప్రకారం నిర్ణయిస్తారు. ఓడీని మాత్రం కారు ఎన్ని కిలోమీట‌ర్లు డ్రైవ్ చేస్తార‌నే అంచ‌నా ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ పరిమితి మ‌ధ్యలో అధిక శ్లాబ్‌తోపాటు సాధారణ బీమాకు మారే అవ‌కాశం ఉంటుంది. పరిమితిదాటితే... థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే వర్తించగా... క్లెయిమ్‌ స‌మ‌యంలో ఓన్ డ్యామేజ్‌కు మాత్రం క‌వ‌రేజీ ల‌భించ‌దు.

జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్

టాటా ఏఐజీ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కూడా వాడిన మేరకు వాహనాలకు బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆటోసేఫ్‌గా పిలిచే టెలిమాటిక్స్ ఆధారిత నెక్ట్స్ జ‌న్ యాప్‌ లేదా డివైజ్‌ ఆధారంగా ప్రీమియం నిర్ణయించడం జరుగుతుంది. జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ చేసే డివైజ్‌ను కారుకు బిగించ‌డం లేదా లింక్ చేయాలి. పాల‌సీ గ‌డువు ముగిసే వ‌ర‌కు దీనిని కొనసాగించాల్సి ఉంటుంది.

వాహనాలపై ఎక్కువగా ప్రయాణం చేయని వారికి పే-యాజ్-యూ-డ్రైవ్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోవ‌డం ఎంతో ఉపయోగకరమని బీమా సంస్థలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి : పారదర్శకత పెంపే లక్ష్యంగా... కేంద్రం కొత్త విధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.