ETV Bharat / state

Health Insurance : గురకను పేర్కొనలేదని బీమా తిరస్కరిస్తారా?

నీకు గురక ఉందని బీమా తీసుకున్నప్పుడు చెప్పలేదు. అందుకే నీ చికిత్సకు అయిన ఖర్చును క్లెయిమ్ చేసుకోలేవు అంటూ బీమా సంస్థ ఓ వ్యక్తిని తిరస్కరించింది. అసలే శస్త్రచికిత్స అయింది. దానికోసం చేసిన అప్పులు చుట్టుముట్టాయి. బీమా సంస్థ ఏమో పైసలివ్వము పో అంటుంది. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆ వ్యక్తి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించాడు. ఆ తరువాత ఏమైంది.?

insurance-company
బీమా తిరస్కరిస్తారా?
author img

By

Published : Aug 28, 2021, 10:59 AM IST

పాలసీ తీసుకునే సమయంలో తనకు గురక సమస్య ఉందని చెప్పనందుకు బీమా క్లెయిమ్‌ను తిరస్కరించడాన్ని హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 తప్పు పట్టింది. చికిత్సకు అయిన ఖర్చు రూ.8,82,556ను 9 శాతం వడ్డీతో ఫిర్యాదుదారుడికి చెల్లించాలని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ లిమిటెడ్‌ సంస్థను ఆదేశించింది. మానసిక వేదనకు పరిహారంగా రూ.50 వేలు, కేసు ఖర్చులకు రూ.10 వేలు కూడా చెల్లించాలని పేర్కొంది.

హిమాయత్‌నగర్‌కు చెందిన కామేశ్వర అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌లో ఆరోగ్య బీమా తీసుకున్నారు. తరవాత అది హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ లిమిటెడ్‌గా మార్పు చెందింది. కొన్నాళ్లకు ఆయన తలకు కారు డోరు తగిలి తర్వాతి రోజు నీరసం, శరీరం సహకరించకపోవడం వంటి లక్షణాలుండటంతో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చూపించుకున్నారు. పరిశీలించిన వైద్యులు అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఏప్నియా (ఓఎస్‌ఏ) ఉందని గుర్తించారు.

శస్త్రచికిత్స చేసి, వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స అందించారు. కామేశ్వర బీమా క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోగా తొలుత రూ.5.50 లక్షలు మంజూరవుతాయని చెప్పిన బీమా సంస్థ, ఫిర్యాదుదారు బీమా పాలసీ తీసుకునే సమయంలో గురక ఉందన్న విషయాన్ని వెల్లడించలేదంటూ ఆఖరి నిమిషంలో క్లెయిమ్‌ను తిరస్కరించింది. దాంతో ఆసుపత్రి యాజమాన్యం కామేశ్వర వద్ద రూ.8.82 లక్షల బిల్లు వసూలు చేసింది. ఆ తరవాత ఆ డబ్బు కోసం యత్నించినా ఇన్స్యూరెన్స్‌ సంస్థ స్పందించలేదు. అనంతరం ఫిర్యాదుదారు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇరువురి వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా కమిషన్‌-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, ఆర్‌.ఎస్‌.రాజెశ్రీతో కూడిన బెంచ్‌ ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. గురక వ్యాధి కాదని, ఒక అనారోగ్య సమస్య మాత్రమేనని వ్యాఖ్యానించింది. కామేశ్వర తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ఎన్‌ శర్మ వాదనలు వినిపించారు.

ఇదీ చూడండి: Insurance: ప్రతివారం ఖర్చులకు డబ్బు అందించే 'బీమా' పథకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.