కడప జిల్లా మైదకూరు పట్టణంలోని ఇంధన బంకులో డీజిల్ కల్తీ చర్చనీయాంశమైంది. బంకులోని పంపు నుంచి పాలలాగా డీజిల్ రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. పండు అనే వ్యక్తి వాహనానికి డీజిల్ పోయించగా మధ్యలోనే వాహనం ఆగిపోయింది. కారణం తెలుసుకునే ప్రయత్నంలో డీజిల్ పైపు తొలగించి చూడగా పాలలాగ బయటకి రావటం గమనించారు. నష్టం జరిగిందని గమనించిన వినియోగదారుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం వరకు డీజిల్ బాగానే వచ్చిందని.. మధ్యాహ్నం ట్యాంకర్ వచ్చి నింపిన తర్వాతే ఈ సమస్య ఉత్పన్నమైందని ఇంధన బంకు సిబ్బంది స్పష్టం చేశారు. బంకు యాజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:బాసరలో ముస్లిం అబ్బాయికి అక్షరాభ్యాసం