Inquiry into the Ramanthapur incident హైదరాబాద్లో నిన్న జరిగిన నారాయణ కాలేజ్ ఘటనపై ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఒమర్ జలీల్ స్పందించారు. హైదరాబాద్లోని రామాంతాపూర్లో నారాయణ కాలేజీలో టీసీ కోసం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థి ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. కళాశాల యాజమాన్యాన్ని ఈరోజు వరకు నివేదిక అడిగామని, రిపోర్ట్ వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఏ కాలేజీకి అయిన ద్రువపత్రాలు ఆపే హక్కు లేదని, ఫీజుల కోసం వేధింపులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని... తాము ఉన్నామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఫీజుల విషయంలో ఇబ్బందులు ఉంటే నేరుగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు తీసుకోవాలని..లేదంటే ఆయా కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంత్రి ఆదేశాలు ప్రకారం ఆ కాలేజీపై విచారణ చేపడుతున్నాం.హైదరాబాద్ డీఈఓ కార్యలయం నుంచి వారికి నోటీసులు జారీ చేశాం. ఈ రోజు సాయంత్రం లోగా వారు నివేదిక ఇవాల్సి ఉంది. నివేదిక ఆదారంగా వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఏ కాలేజీ అయిన ఫీజుల విషయంలో విద్యార్థులకు ఇబ్బంది పెట్టకూడదు. ద్రువపత్రాలు ఆపే హక్కు కాలేజీలకు లేవు. ఆలా ఆపారని మావద్దకు ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. -ఒమర్ జలీల్, ఇంటర్ బోర్టు కార్యదర్శి
ఇవీ చదవండి :