పాలకవర్గం గడువు ముగియనున్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. హన్మకొండ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత ధర్మారావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీల పాలకవర్గం గడువు త్వరలో ముగియనున్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చిన్నోళ్ల నరేశ్‌రెడ్డి వాదించారు. స్పందించిన హైకోర్టు రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
ఇదీ చూడండి: తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్ పీఠం