ETV Bharat / state

రెవెన్యూ ట్రైబ‌్యునళ్లలో కేసులపై హైకోర్టులో విచారణ - Telangana high court updates

రెవెన్యూ ట్రైబ‌్యునళ్లలో కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ట్రైబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కారించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెవెన్యూ ట్రైబ్యునళ్లలో ఇరువైపులా వాదనలకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది.

రెవెన్యూ ట్రైబ‌్యునళ్లలో కేసులపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Mar 2, 2021, 3:47 PM IST

రెవెన్యూ ట్రైబ‌్యునళ్లలో కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. ట్రైబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కారించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెవెన్యూ ట్రైబ్యునళ్లలో ఇరువైపులా వాదనలకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణ లేకుండానే వివాదాలను తేలుస్తున్నాయన్న పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. విచారణ లేకుండా పరిష్కరించిన కేసులెన్నో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జిల్లాల వారీగా ట్రైబ్యునళ్లలో పెండింగ్ కేసులు సమర్పించాలని.. బదిలీ జరిగిన కేసులు, పరిష్కారమైన వాటికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ నెల 18లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్ ఫిర్యాదులన్నీ ట్రైబ్యునళ్లకు బదిలీ చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బదీలీ అయిన కేసులను ట్రైబ్యునళ్లు దాదాపు పరిష్కరించాయని తెలిపింది. చాలా కేసులు ట్రైబ్యునళ్లకు బదిలీ కాకుండానే విచారణ పూర్తయ్యాయని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు వివరించారు.

ఇదీ చదవండి: కరోనా తొలి కేసుకు ఏడాది.. 'గాంధీ'పై ఈటల ప్రశంసల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.