ETV Bharat / state

Innovative Expo in Vignan College : 'ఇన్నోవేట్ టు ఇన్‌స్పైర్'.. విజ్ఞాన్​ కాలేజ్​లో ఇన్నోవేటివ్ ఎక్స్‌పో-2023 - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

Innovative Expo in Vignan College : హైదరాబాద్ విజ్ఞాన్ కాలేజ్​లో విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు 'ఇన్నోవేట్ టు ఇన్‌స్పైర్' నినాదంతో ఇన్నోవేటివ్ ఎక్స్​పో-2023ను నిర్వహించారు. ఈ ఎక్స్​పోలో విద్యార్థులు రూపొందించిన దాదాపు 386 ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిని చూసేందుకు నగరం నలుమూలల నుంచి వివిధ కళాశాలల విద్యార్థులు వచ్చారు.

Vignan College
Innovative Expo in Vignan College
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 8:28 AM IST

Innovative Expo in Vignan College : నేటి యువతలోని సృజనాత్మకతను వెలికితీసి వారికి అవకాశాలు కల్పించేందుకు ఎన్నో వేదికలున్నాయి. వాటి సాయంతో యువత అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. అలాంటి ఆవిష్కరణల కోసం.. యువతలోని నైపుణ్యాన్ని బయటకు తీసి వారికి తోడ్పాటును అందించడానికి హైదరాబాద్​లోని విజ్ఞాన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్​లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజ్ఞాన్ ఇన్నోవేటివ్ ఎక్స్​పో-2023 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ శాఖలు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచ్​ల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.

Tech Fest in Vignan College Hyderabad : ఈ విద్యార్థులంతా తమలోని నైపుణ్యాన్ని ఈ ఎక్స్​పోలో ప్రదర్శించారు. వివిధ రకాల ఆవిష్కరణలను ఈ ప్రదర్శనలో చూపించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 386 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. అందులో చాలా వరకు సామాజిక అంశాలకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఈ టెక్ ఫెయిర్ చూడటానికి వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు భారీగా వచ్చారు. విజ్ఞాన్ విద్యార్థులు, అధ్యాపకులు.. సందర్శకులకు తమ ప్రాజెక్టుల వివరాలు వివరించారు.

ఈ ఎక్స్​పోలో ఓ ప్రాజెక్టు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. నేచురల్ లాంగ్వేజ్​ను ఉపయోగించి విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించాలే లక్ష్యంగా ఓ వ్యవస్థను అభివృద్ధి చేశారు కొందరు విద్యార్థులు. లావణ్య కుమారి ఆధ్వర్యంలో డేటా సైన్స్ డిపార్ట్​మెంట్​కు చెందిన మిహిర్ కుమార్ రాయ్ (20), ఎండి అమానుల్లా (19), జి సిద్ధార్థ (19), వి నిహారిక (19) డెవలప్ చేసిన ఈ ఆవిష్కరణ సందర్శకుల మనసు గెలుచుకుంది.

JIO Bharat Amazon : 'జియో భారత్​' సేల్స్​ ప్రారంభం.. రూ.999కే అమేజింగ్ ఫీచర్స్​తో 4జీ ఫోన్​!

Google Storage Cleanup : ఫ్రీగా గూగుల్ స్టోరేజ్​ వాడుకోవాలా?.. మీ జీ-మెయిల్​, గూగుల్​ డ్రైవ్​లను ఇలా క్లీన్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.