కరోనా వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్దఎత్తున విరాళాలు అందించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావులను కలిసి చెక్కులు అందజేశారు.
సీఎం కేసీఆర్‌కు...
రెడ్డీస్ ల్యాబ్స్ రూ.5 కోట్ల విలువైన మందులు, ఎన్ 95 మాస్కులు. అంగీకార పత్రాన్ని సంస్థ ఛైర్మన్ సతీశ్, ఎండీ జీవీ ప్రసాద్ అందజేశారు. ఎమ్‌ఎస్‌ఎన్ ల్యాబ్స్ నుంచి రూ.5 కోట్ల విలువైన మందులు, వైద్య సామగ్రి. అంగీకార పత్రాన్ని ఆ సంస్థ ఛైర్మన్ ఎం.సత్యనారాయణరెడ్డి అందజేశారు. ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలోని దాతలు ‘గుడ్ సమరిటన్స్ ఆఫ్ ఖమ్మం’ పేరిట రూ.1.75 కోట్లు, మమత వైద్య విద్య సంస్థలు రూ.25 లక్షలు. మొత్తం రూ.2 కోట్ల చెక్కును మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సీఎంకు అందించారు. రాష్ట్రంలోని ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) వీవోఏలు రూ. 1,72,61,000 విరాళంగా అందించారు. మొత్తం 17,261 మంది వీవోఏలున్నారు. వారికి నెలకు రూ.3 వేల వేతనం కాగా.. ఒక్కొక్కరు రూ.వెయ్యి విరాళంగా ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఐకేపీ వీవోఏల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎల్.రూప్‌సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్ విరాళాన్ని సీఎంకు అందజేశారు.
రాష్ట్ర మహిళా సమాఖ్యలకు చెందిన స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తరుఫున రూ.కోటి. స్త్రీనిధి అధ్యక్షురాలు ఎస్.అనిత ఈ చెక్కును అందజేశారు. తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణరెడ్డిలు రూ. కోటి అందజేశారు. తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు, ఎం పీరంజిత్‌రెడ్డి రూ.కోటి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు (టెస్కాబ్) తరఫున ఛైర్మన్ కొండూరు రవీందర్‌రావు రూ.కోటి చెక్కును అందించారు. డీసీసీబీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రూ.76 లక్షలు, రాష్ట్ర జాతీయ రహదారుల గుత్తేదారులు రూ.2.25 కోట్లు. ఇందులో అనూష ప్రాజెక్ట్స్ ప్రై. లిమిటెడ్ ఎండీ ఎ.జలంధర్‌రెడ్డి, డీఈసీ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఎండీ అనిరుధ్‌గుప్తా, కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ కె.అనిల్‌కుమార్‌లు రూ.50 లక్షల చొప్పున.. ఎస్‌ఎల్‌ఎంఐ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ బి.వెంకట్‌రెడ్డి, శ్రీవెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్ ఎండీ ఎం.రవీందర్‌రెడ్డి, సీల్ వెల్ కార్పొరేషన్ ఎండీ బంగారు సుబ్బారావు రూ. 25 లక్షల చొప్పున విరాళమిచ్చారు. సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల విరాళం అందించారు. ఇరు రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు అవసరమైన పరికరాలనూ అందిస్తానని ఆయన ప్రకటించారు.
మంత్రి కేటీఆర్‌కు...
జీవీకే బయో సైన్సెస్ బృందం రూ.5 కోట్ల విలువైన 1,27,551 పీపీఈ కిట్ల యూనిట్లు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో పలువురు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు రూ.2.43 కోట్ల విరాళాలను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. (ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్, దినేశ్, సుభాష్‌గుప్తాలు రూ.31 లక్షలు, హిమాన్ష్ రూ.21 లక్షలు, హారిక హాసిని క్రియేషన్స్ సూర్యదేవర రాధాకృష్ణ రూ. 20 లక్షలు, గ్రీన్‌సిటీ ఎస్టేట్స్, కార్తికేయ ఇండస్ట్రీస్ సూర్య శంకర్‌రెడ్డి రూ.15 లక్షల చొప్పున, జెక్ కాలనీ ఫెడరేషన్ రూ.11 లక్షలు, దేవశ్రీ ఇస్పాట్ లిమిటెడ్ ప్రకాశ్ గోయెంకా, ధనలక్ష్మి స్టీల్స్ ప్రేమ్‌చంద్ అగర్వాల్, జైరాజ్ ఇప్పాట్ సజ్జన్ గోయెంకాలు రూ.10 లక్షల చొప్పున..) వెల్జన్ డెన్షన్ లిమిటెడ్, సాగర్ సిమెంట్స్ లిమిటెడ్, కె.రహేజా కార్పొరేట్ సర్వీసెస్ ప్రై.లిమిటెడ్ రూ.కోటి చొప్పున.. కాకినాడ సీ పోర్ట్స్ ఛైర్మన్ కేవీ రావు రూ.50 లక్షలు అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ తరఫున ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి రూ.50 లక్షలు, తెలంగాణ స్పిన్నింగ్, టెక్స్‌టైల్ మిల్స్, ఆదిత్య హోమ్స్ రూ.50 లక్షల చొప్పున.. యూనిక్ ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ రామడుగు రామ్‌దేవ్‌రావు రూ.25 లక్షలు.. కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సప్తగిర్ కాంఫర్ లిమిటెడ్ తదితర సంస్థలు రూ.25 లక్షల చొప్పున బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ రూ.10 లక్షలు, తెలంగాణ పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైౖర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా వ్యక్తిగతంగా రూ.10 పది లక్షలు.. నవతేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జి.యాదగిరిరావు రూ.పది లక్షలు సీఎం సహాయ నిధికి అందజేశారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో విస్తరిస్తోన్న కరోనా.. 364 కేసులు నమోదు