ETV Bharat / state

తెలంగాణలో ఇండోనేషియా పెట్టుబడులు - Latest news in Telangana

మంత్రి కేటీఆర్‌తో ఇండోనేషియా రాయబారి సమావేశం జరిగింది. తెలంగాణలో పెట్టుబడులకు ఇండోనేషియా ఆసక్తిగా ఉందని ఆ దేశ రాయబారి సూర్యొదిపురొ తెలిపారు. త్వరలోనే పారిశ్రామికవేత్తలు పర్యటిస్తారని వెల్లడించారు. ప్రభుత్వపరంగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీనిచ్చారు.

Indonesia interested in investing in Telangana.
తెలంగాణలో ఇండోనేషియా పెట్టుబడులు
author img

By

Published : Dec 16, 2020, 9:07 AM IST

తెలంగాణలో పెట్టుబడులకు ఇండోనేషియా పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నారని ఆ దేశ రాయబారి సూర్యొదిపురొ తెలిపారు. త్వరలోనే వారు రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు. ఇండోనేషియా పారిశ్రామికవేత్తలను తాము స్వాగతిస్తున్నామని, అన్నివిధాలా వారిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. భారత్‌లో ఇండోనేషియా రాయబారి సూర్యొదిపురొ, ముంబయి కాన్సులేట్‌లోని కాన్సుల్‌ జనరల్‌ అగస్‌ పి.సప్టోనొలు మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

సూర్యొదిపురొ మాట్లాడుతూ.. భారత్‌-ఇండోనేషియాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అవి మరింత బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రోత్సాహాకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. తమ దేశ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తున్నారని వివరించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమని, ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వారికి పారిశ్రామిక విధానం, టీఎస్‌ఐపాస్‌, రాష్ట్రంలో వనరులు, వసతులు, ప్రోత్సాహకాలు, రాయితీలు అనుకూలతలు తదితర అంశాలను వివరించారు. ఇండోనేషియాతో తెలంగాణ అనుబంధం గురించి చర్చించారు. సమావేశం అనంతరం సూర్యొదిపురొ, సప్టోనొలకు మంత్రి కేటీఆర్‌ జ్ఞాపికలు అందజేశారు.

తెలంగాణలో ఫియట్‌ పరిశ్రమ!

ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ ఫియట్‌ తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌, తెలంగాణ ప్రభుత్వం బుధవారం సంయుక్తంగా నిర్వహించే దృశ్యమాధ్యమ సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇందులో ఫియట్‌ ప్రతినిధులు, మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఫియట్‌ తమ వ్యాపార ప్రణాళిక, రాష్ట్ర ప్రభుత్వంతో వ్యూహాత్మక భాగస్వామ్యం, భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించనుంది.ట

ఇదీ చదవండి: 'జనవరి 1 నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.