ఇజ్రాయెల్ ద్వారా గుర్తింపు పొందిన మొదటి సంస్థగా ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్‌కు గుర్తింపు ఉందని సినీనటుడు రాజా తెలిపారు. ఈ అసోసియేషన్ ఏర్పడి 27 ఏళ్లు అయిన సందర్భంగా సికింద్రాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఛైర్మన్ ఆడం రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయంలో డిగ్రీలు పొందిన వారికి ధ్రువపత్రాలు అందించారు. వాణిజ్య, విద్య, వైద్య రంగాలన్నింటిలో ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అసోసియేషన్ ఎంతగానో కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
దాదాపు 300 మంది అసోసియేషన్‌లో ఉండడం గొప్ప విషయమని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. భారతదేశంలోని క్రిస్టియన్లు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక రంగాల్లో లాభాలను పొందే ఆస్కారం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో రాజాతో పాటు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఖమ్మం బల్దియా పోరుకు తెరాస కసరత్తు.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు