జర్మనీ-నెదర్లాండ్ దేశాల నిపుణులు ఇండో జర్మన్ సీడ్ సెక్టార్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు.అక్కడ పరిశీలించిన అంశాలపై తయారుచేసిన నివేదికను మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఉద్యాన శాఖ కమీషనర్ వెంకట్రామ్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, ఇండో-జర్మన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ టీం లీడర్ ఎక్ హార్డ్ స్క్రూడర్, సభ్యులు డాక్టర్ ఎల్మార్ వెస్మాన్, అంతర్జాతీయ విత్తన నిపుణులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ