వందే భారత్ మిషన్లో భాగంగా లండన్‌లో చిక్కుకున్న భారతీయులను అధికారులు స్వదేశానికి తరలించారు. ప్రత్యేక విమానంలో 69 మంది ప్రయాణికులు శంషాబాద్ చేరుకున్నారు. వీరందరికీ విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నారు. వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. లగేజీ తనిఖీల విషయంలో కూడా మరింత జాగ్రత్తలు వహిస్తున్నారు.
ఇవీ చూడండి: 'వలస కూలీల కోసం రోజుకు 100 రైళ్లు నడపాలి'