హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులు 18 లోపు హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. నిలిపివేసిన తరగతులను ఆన్ లైన్ ద్వారా అందించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ ప్రారంభంలో ఏటా జరిగే వార్షిక గ్రాడ్యూయేషన్ కార్యక్రమం మొదటి సారిగా వాయిదా పడింది. హైదరాబాద్‌తో పాటు పంజాబ్‌లోని మొహాలీ క్యాంపస్‌లో విద్యార్థులు సురక్షితంగా ఉండేందుకు కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూసేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హాస్టళ్లు ఖాళీ చేయండి : ఇండియన్ బిజినెస్ స్కూల్ - ISB ORDERED STUDENTS
దేశంలో చాప కింద నీరులాగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నివారణకు ఇండియన్ బిజినెస్ స్కూల్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించింది.