ETV Bharat / state

'గడిచిన 24 గంటల్లో 150 టన్నుల ఆక్సిజన్ సరఫరా' - Indian Railways oxygen express

గడిచిన 24 గంటల్లో సుమారు 150 టన్నుల ఆక్సిజన్​ను... ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా చేరవేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. మూడో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ నేడు లక్నో నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది.

ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​
ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​
author img

By

Published : Apr 24, 2021, 10:22 PM IST

కొవిడ్ సమయంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు భారతీయ రైల్వే తమవంతు కృషి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో సుమారు 150 టన్నుల ఆక్సిజన్​ను... ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా చేరవేసినట్లు వెల్లడించింది. లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎమ్‌ఓ)తో మహారాష్ట్రలోని నాసిక్‌, యూపీలోని లక్నోకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ చేరుకుందని తెలిపింది.

మార్గ మధ్యలో ఆక్సిజన్‌ సరఫరా కోసం నాగ్​పూర్‌, వారణాసిలో కంటైనర్లను అన్‌లోడ్‌ చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. మూడో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ సైతం నేడు లక్నో నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రవాణాకు గ్రీన్ కారిడార్లు ఉపయోగపడుతున్నట్లు వివరించింది.

ఇలాంటి రైళ్లు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్, దిల్లీ వంటి రాష్ట్రాలు సంప్రదిస్తున్నాయని స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాలకు ఆక్సిజన్ రవాణా రోడ్డు మార్గం కంటే రైల్వే ద్వారా వేగంగా జరుగుతుందన్న రైల్వే శాఖ.. రైళ్ల ద్వారా నిరంతరం రవాణా చేయవచ్చని తెలిపింది.

ఇదీ చూడండి: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.