ETV Bharat / state

సోమవారం నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 30 ప్రత్యేక రైళ్లు

లాక్​డౌన్​ సడలింపుల నేపథ్యంలో భారత రైల్వే శాఖ జూన్​ 1 నుంచి 230 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అందులో దక్షిణ మధ్య రైల్వే 33 రైళ్లను పట్టాలెక్కించటానికి ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో మాదిరిగా రైలు బయల్దేరే సమయానికి స్టేషన్​కు చేరుకుంటామంటే కుదరదని స్పష్టం చేసింది. ఆ నిబంధనలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

South central railway latest news
South central railway latest news
author img

By

Published : May 31, 2020, 10:28 PM IST

దక్షిణ మధ్య రైల్వే సోమవారం నుంచి 33 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వీటిలో మూడు రైళ్లను నడుపుతున్నారు. జోన్ మీదుగా ఐదు జతల రైళ్లు వెళ్తాయని పేర్కొంది. అధీకృత ప్రయాణ టికెట్లు ఉన్న వ్యక్తులను మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

కరోనా లక్షణాలు ఉంటే అనుమతించం...

రైళ్లలో ప్రయాణించే వారు గంటన్నర ముందు స్టేషన్​కు చేరుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఈ రైళ్లకు రిజర్వు చేయని టికెట్లు ఇవ్వరు. కొవిడ్ -19 లక్షణాలతో ఉన్న ప్రయాణికులు అనుమతించడంలేదని రైల్వే శాఖ పేర్కొంది. కరోనా నివారించడంలో భాగంగా రైళ్ల లోపల దుప్పట్లు ఇవ్వడం లేదు. ప్రయాణికులు తక్కువ సామాన్లనే తీసుకెళ్లడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

వారు ప్రయాణించకపోవటం మంచిది...

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, పదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు రైళ్లలో ప్రయాణించకుండా ఉండడం మంచిదని రైల్వేశాఖ అభిప్రాయపడింది. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటంతోపాటు రైల్వే ప్రాంగణాలు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రతిరోజూ నడిచే రైళ్ల వివరాలు...

  • సికింద్రాబాద్ నుంచి హౌరాకు ఫలక్ నుమా ఎక్స్​ప్రెస్
  • సికింద్రాబాద్ నుంచి ధనపూర్​కు ధనపూర్ ఎక్స్​ప్రెస్
  • సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు గోల్కొండ ఎక్స్​ప్రెస్
  • హైదరాబాద్ నుంచి ముంబయి సీఎస్ఎంటీకి హుస్సేన్ సాగర్ ఎక్స్​ప్రెస్
  • హైదరాబాద్ నుంచి న్యూదిల్లీకి తెలంగాణ ఎక్స్​ప్రెస్
  • హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి గోదావరి ఎక్స్​ప్రెస్
  • నిజామాబాద్ నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్​ప్రెస్
  • నాందేడ్ నుంచి అమృత్ సర్​కి సచ్ కంద్ ఎక్స్​ప్రెస్
  • సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్​కు నిజాముద్దీన్ ఎక్స్​ప్రెస్ (గురు, ఆదివారాలు మాత్రమే)

దక్షిణ మధ్య రైల్వే మీదుగా ప్రతి రోజు నడిచే 5 జతల రైళ్ల వివరాలు...

  • ముంబయి సీఎస్​ఎంటీ నుంచి భువనేశ్వర్ కోనార్క్​ ఎక్స్​ప్రెస్
  • ముంబయి సీఎస్​ఎంటీ నుంచి బెంగళూరు ఉద్యాన్ ఎక్స్​ప్రెస్
  • ధనపూర్ నుంచి బెంగళూరుకు సంఘమిత్ర ఎక్స్​ప్రెస్
  • విశాఖపట్టణం నుంచి న్యూదిల్లీ ఏపీ ఎక్స్​ప్రెస్
  • హౌరా నుంచి యశ్వంత్ పూర్​కు దురంతో ఎక్స్​ప్రెస్

ఇప్పటికే నడుస్తున్న రెండు జతల ఎక్స్​ప్రెస్​ల వివరాలు...

  • న్యూదిల్లీ నుంచి బెంగళూరు(ప్రతిరోజూ)
  • న్యూదిల్లీ నుంచి చెన్నై( వారానికి రెండు సార్లు)
  • న్యూదిల్లీ నుంచి సికింద్రాబాద్(వారానికి ఒకరోజు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.